Chingari App: డౌన్‌లోడ్స్‌లో దుమ్మురేపుతోన్న చింగారి యాప్

Chingari App On Google Play Store | సోషల్ మీడియా యాప్ చింగారి రికార్డులు బద్దలుకొడుతోంది. భారీ సంఖ్యలో డౌన్‌లోడ్స్‌తో గూగుల్ ప్లే స్టోర్‌లో అత్యంత ఆదరణ పొందిన యాప్‌ల సరసన చేరింది. టిక్ టాక్ బ్యాన్ చేసిన తర్వాతే భారత్‌లో చింగారి యాప్ పేరు మార్మోగిపోయింది. ఈ క్రమంలో 10 మిలియన్ల డౌన్‌లోడ్స్ (Chingari App crosses 10mn downloads on Google Play Store) మార్కు చేరుకుంది. 

Last Updated : Jul 3, 2020, 03:09 PM IST
Chingari App: డౌన్‌లోడ్స్‌లో దుమ్మురేపుతోన్న చింగారి యాప్

బెంగళూరు: భారత ప్రభుత్వం టిక్ టాక్ (India Bans Tik Tok APP), హెలో(Helo) సహా 59 చైనా యాప్స్‌ను నిషేధించిన అనంతరం దేశీయ స్మార్ట్ ఆప్స్‌కు టైమొచ్చింది. ముఖ్యంగా టిక్ టాక్ యాప్ బ్యాన్ కావడంతో అందుకు ప్రత్యామ్నాయంగా చెబుతున్న మరో సోషల్ యాప్ చింగారి (Chingari App) తెరమీదకి వచ్చింది. TikTok Data: మీ టిక్ టాక్ డేటాను ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

ఈ యాప్‌ను రోజుకు కొన్ని లక్షల సంఖ్యలో స్మార్ట్‌ఫోన్ యూజర్లు డౌన్‌లోడ్(Chingari App Downloads) చేస్తున్నారు. ఈ క్రమంలో గూగుల్ ప్లే స్టోర్‌లో 10 మిలియన్ల డౌన్‌లోడ్స్ (Chingari App 10 Million Downloads) మార్కును చింగారి యాప్ చేరుకోవడం విశేషం. కేవలం గత వారం రోజుల వ్యవధిలో జనాల నోళ్లలో నానిన చింగారి యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న తొలి రెండు స్మార్ట్ యాప్‌గా నిలిచింది. దీనిపై చింగారి సహవ్యవస్థాపకుడు బిస్వాత్మ నాయక్ హర్షం వ్యక్తం చేశారు. Also read: ప్రాణం తీసిన tiktok పాపులారిటీ..

ప్రతిరోజూ భారీ సంఖ్యలో డౌన్‌లోడ్స్ అయితున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. నెటిజన్ల అంచనాలు అందుకోవడానికి తమ టీమ్ క్షణం తీరిక లేకుండా 24 గంటల పాటు యాప్ డెవలప్‌మెంట్ కోసం పని చేస్తున్నట్లు తెలిపారు. గత 72 గంటల వ్యవధిలో 5 లక్షల మంది చింగారి యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారని వెల్లడించారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
 బికినీలో బిగ్‌బాస్ రన్నరప్.. వామ్మో అంత హాట్‌గా!
 

Trending News