Naveen Patnaik: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్(Naveen Patnaik) కాన్వాయ్‌పై భాజపా మద్దతుదారులు(BJP supporters) కోడిగుడ్లతో దాడి చేశారు. పూరీలో రూ.331 కోట్ల హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన పట్నాయక్(naveen patnaik).. భువనేశ్వర్(Bhubaneswar)కు తిరిగి వెళ్తుండగా ప్రభుత్వ ఆసుపత్రి స్క్వేర్ సమీపంలో ఈ ఘటన జరిగింది.
కలహండి ఉపాధ్యాయురాలు కిడ్నాప్, హత్య కేసు(Kalahandi teacher's kidnap and murder case)లో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి డీఎస్ మిశ్రా(DS Mishra)ను తొలగించాలని కొన్న వారాలుగా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీరుకు నిరసనగా పూరీలో కొందరు ఆందోళనలు చేపట్టారు. నల్లజెండాలతో నిరసన తెలిపారు. అంతకుముందు.. పూరీలోని గ్రాండ్ రోడ్లో నల్లజెండాలు ప్రదర్శించిన బీజేవైఎం, కాంగ్రెస్ అనుబంధ ఎన్ఎస్యూఐకి చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Also Read: Free Biryani For Tomatoes: బిర్యానీ లవర్స్ కు గుడ్ న్యూస్.. కేజీ టమాటాలకు బిర్యానీ ఉచితం
సీఎం కాన్యాయ్‌పై జయంత్ దాస్ నేతృత్వంలో కోడిగుడ్ల దాడి చేసింది తామేనని బీజేవైఎం ఒడిశా అధ్యక్షుడు ఇరాసిస్ ఆచార్య(Irasish Acharya) తెలిపారు. పట్నాయక్ తన మంత్రులపై చర్యలు తీసుకునే వరకు ఈ నిరసన కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook