Article 370: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో ఆర్టికల్ 370 రచ్చ రచ్చ.. బాహా బాహీకీ దిగిన ఎమ్మెల్యేలు..

Article 370: జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీలో ఆర్టికల్ 370, పునరుద్ధరణ విషయమై పెద్ద రచ్చ నడిచింది. ఆర్టికల్ 370, పునరుద్ధరణ కోసం సంప్రదింపులు ప్రారంభించాలని కోరుతూ జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ  తీర్మానం చేయడం వివాదాస్పదమైంది. ఈ తీర్మానాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. దీంతో జమ్మూ కశ్మీర్ లో  అసెంబ్లీలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకున్నాయి.  

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 7, 2024, 12:36 PM IST
Article 370: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో ఆర్టికల్ 370 రచ్చ రచ్చ.. బాహా బాహీకీ దిగిన ఎమ్మెల్యేలు..

Article 370: జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 పునరుద్దరణ పై అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.  ఇలాంటి గందరగోళ పరిస్థితి మధ్యే స్పీకర్  తీర్మానంపై ఓటింగ్ నిర్వహించి ఆమోదం పొందినట్లు ప్రకటించారు. ఆర్టికల్ 370 జమ్మూ కశ్మీర్‌కు కొన్ని ప్రత్యేక అధికారాలను కల్పిస్తోంది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఆ తర్వాత అదే యేడాది అక్టోబర్ 31న జమ్మూ కశ్మీర్, లడక్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.  పార్లమెంట్ ఆమోదం ద్వారా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో జమ్మూ కాశ్మీర్‌కు కొన్ని దశాబ్దాలుగా ఉన్న ప్రత్యేక అధికారాలు రద్దయ్యాయి. అనంతరం జమ్మూ కాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్‌‌లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని JKNC అక్టోబర్ 16న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జమ్మూ కాశ్మీర్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చోటు చేసుకుంది.

జమ్మూ కశ్మీర్ ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరి.. అసెంబ్లీలో బుధవారం (నవంబర్ 6) ఉదయం ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. జమ్మూ కశ్మీర్ ప్రజల గుర్తింపు, సంస్కృతి, హక్కులను పరిరక్షించడంలో ఆర్టికల్ 370 రక్షణగా నిలుస్తోందని తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆర్టికల్ 370 పునరుద్ధరణకు సంబంధించి ఎన్నికైన ప్రతినిధులతో చర్చలు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది.

ఆర్టికల్ 370ని ఏకపక్షంగా తొలగించడంపై ఈ సభ ఆందోళన వ్యక్తం చేస్తోంది. జమ్మూ కాశ్మీర్ ప్రజల గుర్తింపు, సంస్కృతి, హక్కులను పరిరక్షించే ప్రత్యేక హోదాను రాజ్యాంగ హామీ ద్వారా పొందాలన్నారు. ప్రతిపక్ష నాయకుడు సునీల్ శర్మ సహా బీజేపీ సభ్యులు ఈ చర్యపై  తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ముందుగా ప్రకటించిన అంశాల్లో ఈ తీర్మానాన్ని చేర్చలేదని వాదించారు. దేశంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేవాలయం (పార్లమెంట్) ఈ చట్టాన్ని ఆమోదించిందని సునీల్ శర్మ అన్నారు.

ఈ సందర్భంగా బీజేపీ సభ్యులు తీర్మానం ప్రతులను చించివేసి, వెల్‌లోకి విసిరేశారు. వారి నిరసనలతో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ అట్టుడికిపోయింది.బయటి వ్యక్తులు ఆస్తులు కొంటున్నారు. ‘బయటి నుంచి వచ్చిన వ్యక్తులు జమ్మూ కాశ్మీర్‌లో ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో జమ్మూ కాశ్మీర్ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆర్టికల్ 370 రద్దు కారణంగా ఇక్కడి ప్రజలు నష్టపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు’ అని డిప్యూటీ సీఎం సురీందర్ సింగ్ చౌదరి అన్నారు. సభ వాయిదా పడిన అనంతరం ఏఎన్‌ఐ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ తీరుపై  విరుచుకుపడ్డారు

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News