6th Phase Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 6వ దశలో పోలింగ్ జరిగేది ఈ లోక్‌సభ సీట్లలోనే..

6th Phase Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా ఎన్నికల కమిషన్ 7 విడతల్లో ఎన్నికల నిర్వహిస్తోంది. అందులో భాగంగా 5 విడత ఎన్నికలు పూర్తయ్యాయి. 6వ విడత ఎన్నికలు కాసేటి క్రితమే ప్రారంభమయ్యాయి. ఈ విడతలో ఢిల్లీ, హర్యానా, ఒడిషా, యూపీ, బిహార్, పశ్చిమ బెంగాల్ సహా ఏయే లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరగుతున్నాయంటే..

Written by - TA Kiran Kumar | Last Updated : May 25, 2024, 07:20 AM IST
6th Phase Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 6వ దశలో  పోలింగ్ జరిగేది  ఈ లోక్‌సభ సీట్లలోనే..

6th Phase Lok Sabha Polls 2024: వరల్డ్ లోనే భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ దాదాపు 97 కోట్లకు పైగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అంతేకాదు వీళ్లే దేశానికి భావి భారత ప్రధాని ఎవరనేది నిర్ణయించేది. ఈ సారి మన దేశంలో 18 లోక్ సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మన దేశంలో ఏప్రిల్ 19వ తేదిన మొదటి దశలో 102 స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. అటు  రెండో దశలో భాగంగా 88 లోక్ సభ సీట్లు.. మూడో దశలో 92 లోక్‌సభ సీట్లకు ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. సూరత్ స్థానం ఏకగ్రీవంగా ఎన్నికైన స్థానం మినహాయిస్తే.. నాల్గో దశలో ఏపీ, తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ సీట్లకు ఎన్నికల ప్రక్రియ పూర్తైయింది. ఐదో దశలో అతి తక్కువగా 49 సీట్లకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఆరో దశలో భాగంగా 57+1 మొత్తంగా 58 స్థానాలకు ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తంగా ఈ రోజు ఎన్నికలతో కలిపి దేశ వ్యాప్తంగా 486 లోక సభ సీట్లకు ఎన్నికల ప్రక్రియ ముగ్గుస్తోంది.జూన్ 4న ఎన్నికల కమిషన్ ఫలితాలను ప్రకటించనుంది.  

6వ దశలో ఏయే స్థానాలకు ఎన్నికల జరగనున్నాయంటే..

బిహార్ లోని 8 లోక్ సభ సీట్ల విషయానికొస్తే..
వాల్మీకి నగర్
పశ్చిమ చంపారన్
పూర్వీ చంపారన్
షిహోర్
వైశాలి
గోపాల్ గంజ్
సివాన్
మహారాజ్ గంజ్

హర్యానా లోని 10 లోక్ సభ సీట్ల విషయానికొస్తే..
అంబాలా
కురుక్షేత్ర
సిర్సా
హిస్సార్
కర్నాల్
సోనీపట్
రోహతక్
భివాని - మహేంద్రగర్
గుర్గావ్
ఫరిదాబాద్

ఒడిషాలోని 6 లోక్‌సభ సీట్ల విషయానికొస్తే..
సంబల్ పూర్
కియోన్‌జార్
దెంకెనాల్
కటక్
పూరీ
భువనేశ్వర్

ఉత్తర ప్రదేశ్‌లోని 14 లోక్ సభ సీట్ల విషయానికొస్తే..
సుల్తాన్ పూర్
ప్రతాప్‌ఘర్
ఫూల్ పూర్
అలహాబాద్
అంబేద్కర్ నగర్
శ్రావస్తి
దోమరియాగంజ్
బస్తి
సంత్ కబీర్ నగర్
లాల్ గంజ్
అజాంఘర్
జౌన్పూర్
మచిలీషార్
భాదోహి

పశ్చిమ బెంగాల్ లోని 8 లోక్ సభ సీట్ల విషయానికొస్తే..
తామ్లూక్
కంతి
ఘాతల్
జార్‌గ్రామ్
మేదినిపూర్
పురూలియా
బంకురా
బిష్ణుపూర్

జార్ఖండ్‌లోని 4 స్థానాల విషయానికొస్తే..
గిరిది
ధన్‌బాద్
రాంచి
జంషెడ్‌పూర్

దిల్లీ లోని 7 లోక్ సభ స్థానాల విషయానికొస్తే..
చాందినీ చౌక్
నార్త్ ఈస్ట్ దిల్లీ
ఈస్ట్ దిల్లీ
న్యూ దిల్లీ
నార్త్ వెస్ట్ దిల్లీ
వెస్ట్ దిల్లీ
సౌత్ దిల్లీ

జమ్మూ కశ్మీర్‌లోని

అనంత్ నాగ్ - రాజౌరి స్థానానికి వాతావరణం అనుకూలించపోవడంతో 6వ విడతో నిర్వహిస్తున్నారు. మొత్తంగా 7వ విడత ఎన్నికల తర్వాత జూన్ 4వ తేదిన ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.

Read more: Hyderabad Pothole: హ్యాట్సాఫ్.. మహిళ చేసిన పని సర్కారునే దిగొచ్చేలా చేసింది.. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News