మధ్యప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిలువునా చీలిపోయింది. 20 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు బావుటా ఎగరేశారు.
ఇప్పటికే జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా సమర్పించారు. 18 ఏళ్ల బంధాన్ని తెంచుకున్నారు. దీంతో రాజకీయ సంక్షోభం ముదిరింది. అటు జ్యోతిరాదిత్య రాజీనామా చేయగానే. . ఆయనతో తిరుగుబాటు జెండా ఎగరేసిన 19 మంది ఎమ్మెల్యేలు ఏకంగా ఎమ్మెల్యే పదవులకే రాజీనామా చేశారు. తమ రాజీనామాలను స్పీకర్ ఫార్మాట్ లో పూర్తి చేసి. . అసెంబ్లీకి స్పీకర్ కు పంపించారు. ప్రస్తుతం ఈ ఎమ్మెల్యేలంతా బెంగళూరులోని ఓ రిసార్టులో ఉన్నారు.
Read Also: కమలం ఆట- కాంగ్రెస్కు కటకట
19 మంది ఎమ్మెల్యేలు రాజీనామా పత్రాలు పంపించడంతో మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కారు ఊభిలో కూరుకుపోయింది. ఒకవేళ వారి రాజీనామాలు ఆమోదిస్తే. . కమల్ నాథ్ సర్కారుకు బలం పూర్తిగా తగ్గిపోతుంది. మొత్తం 230 స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్కు 114 మంది బలం ఉంది. బీజేపీకి 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీలో మ్యాజిక్ మార్క్ 116. ఐతే కాంగ్రెస్ నలుగురు స్వతంత్రులు, ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు, ఒక ఎస్పీ ఎమ్మెల్యే మద్దతుతో సర్కారు ఏర్పాటు చేసింది. బీజేపీ ఎమ్మెల్యే ఒకరు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు చనిపోవడంతో ప్రస్తుతం రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..