Glammonn Mrs india 2024: హీరోయిన్ హేమలత రెడ్డికి అంతర్జాతీయ గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు.. హైదరాబాదులో గ్రాండ్ సెలబ్రేషన్స్..

Glammonn Mrs india 2024:  ప్రముఖ టీవీలో యాంకర్ గా పనిచేసిన ఆపై కథానాయికగా పరిచయమైన హేమలత రెడ్డి రీసెంట్ గా గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే కదా. బెస్ట్ ఫోటో జెనిక్, బెస్ట్ టాలెంట్ విభాగంలో అవార్డులు అందుకున్నారు.  అందాల కిరీటం గెలిచిన తర్వాత  హైదరాబాద్ కు తిరిగి వచ్చిన తర్వాత హైదరాబాద్  గచ్చిబౌలి లోని డెక్కన్ సరై గ్రాండ్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 30, 2024, 01:41 PM IST
Glammonn Mrs india 2024: హీరోయిన్ హేమలత రెడ్డికి అంతర్జాతీయ గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు.. హైదరాబాదులో గ్రాండ్ సెలబ్రేషన్స్..

Glammonn Mrs india 2024: విదేశీ గడ్డపై తెలుగు అమ్మాయి హేమలతా రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది.  జెమినీ టీవీ యాంకర్ గా ప్రస్థానం ప్రారంభించిన ఈమె..  ఆ తర్వాత కథానాయికగా తన అదృష్టం పరీక్షించుకుంది.  తాజాగా ఈ యేడాదికి గాను మలేషియాలో నిర్వహించిన గ్లామన్ మిసెస్ ఇండియా పోటీలో విన్నర్ గా అందాల కిరీటం కైవసం చేసుకొని సంచలనం రేపింది. ఈ సందర్భంగా హేమలతా రెడ్డి ఈవెంట్ ఆర్గనైజర్ దువా మేడమ్ తో కలిసి స్థానికంగా ఉండే  బటుకేశవరా దేవాలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా హీరోయిన్ హేమలత రెడ్డి మాట్లాడుతూ : నేను ఎప్పటి నుంచో సినీ ఇండస్ట్రీ లో ఉన్నాను. జెమిని టివి లో ఒక యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి  సీరియల్స్ లో నటించాను.  ఆ తరువాత ప్రొడక్షన్ మీద ఇంట్రెస్ట్ తో నిర్మాతగా  ఒక సినిమా తీశాను. ఆ తర్వాత కోవిడ్ టైంలో ఫ్యాషన్ సైడ్ ట్రై చేశాను. అందులో భాగంగా  సెలెక్ట్ అయ్యి దానికి సంబంధించిన అన్ని  రౌండ్స్  వర్చువల్ గా కంప్లీట్ చేశాను.  ఫైనల్ సెలక్షన్స్ కి మలేషియా వెళ్లాను.

 అక్కడ కాంపిటీషన్ చాల కఠినంగా  నడిచింది. మన భారత దేశంలో దక్షిణాది నుండి నేను మాత్రమే వెళ్లగలిగాను. చివరికి కిరిటం గెలిచాను. ఇక్కడ వరకు వస్తే ఎక్కువ అనుకున్న తనుకు కిరీటం గెలవడాన్ని నమ్మలేకపోయాను. తాను చేసిన కృషికి మంచి గౌరవం దక్కిందనుకుంటాను.  వాళ్లు నిర్వహించిన పోటీలో  మాతృ భాష తెలుగులోనే నేను అక్కడ ప్రశ్నలకు ఆన్సర్స్  ఇచ్చాను. అటు నటన, అలాగే ఇటు గ్లామర్ రెండు కష్టమైన పనులే. నేను ప్రొడ్యూసర్ గా హీరోయిన్ గా చేసిన సినిమా 'నిన్ను చూస్తూ'. ఆ చిత్రంలో  సుహాసిని, సుమన్, సయాజి షిండే లాంటి సీనియర్ నటులతో నటించడాన్ని ఇప్పటికీ మరిచిపోలేదు.  వాళ్ల దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నాను. ముఖ్యంగా సుహాసిని నటనలో మంచి టిప్స్ ఇచ్చారు. ఆవిడ నాకు ఇన్స్పిరేషన్. అలాగే నాకు మా కుటుంబం నుండి మంచి సపోర్ట్ అందించడం వల్లే ఈ కార్యక్రమానికి రాగలిగాను.  ముఖ్యంగా మా నాన్న నాకు చాల సపోర్ట్ గా నిలిచారు. NTV, TV9 లో కూడా నేను పని చేశాను. ఆడవారు గ్లామర్ గా మాత్రమే కాదు.. ప్రతి రంగంలో ముందుండాలి. ఆఫర్ వాస్తే ఎలాంటి క్యారెక్టర్ అయినా చేస్తాను. నా సినిమాని మీడియా చాలా సపోర్ట్ చేశారు.  ఇప్పుడు నా కెరియర్ ని నేను ఫ్యూచర్ లో చేసే రోల్స్, సినిమాలను కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

గ్లామన్ డైరెక్టర్ శ్రీమతి మన్ దువా మాట్లాడుతూ : గ్లామన్ మిస్ అండ్ మిస్సెస్ ఇండియా పోటీని నిర్వహించడం పెద్ద టాస్క్. దాన్ని ఎంతో ఈజీగా నిర్వహించడం ఆనందంగా ఉంది. 39 నగరాల్లో  60 మంది కంటెస్టెంట్స్ నిఎంపిక చేసాము.  35 మందిని మలేషియా తీసుకెళ్లాము. టైటిల్ విన్నర్ గా మీ హైదరాబాద్ అమ్మాయి హేమలత రెడ్డి గెలిచారు. చాలా కఠినంగా కాంపిటీషన్ నడిచింది విన్నర్ ని సెలెక్ట్ చేయడం చాలా కష్టమైనదనే చెప్పాలి.  ఇక ఇప్పుడు గ్లామన్ మిస్ అండ్ మిస్సెస్ వరల్డ్ కాంపిటీషన్ చేస్తున్నాము. 149 దేశాల నుంచి ఎంట్రీస్ ని ఆహ్వానించాము. ఆ ఫినాలేని ప్యారిస్ లో ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు.  అంతే కాక ఈ గ్లామన్ అవార్డు గెలుచుకున్న హేమలత రెడ్డి గారిని త్వరలోనే పారిస్ కు తీసుకెళ్లబోతున్నట్టు  మన్ దువా తెలిపారు.

ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !

ఇదీ చదవండి:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News