Chia seeds: మన శరీరానికి అవసరమైన ఎన్నో ముఖ్యమైన పోషకాలు గల సీడ్స్ లో చియా సీడ్స్ ప్రధానమైనవి. పోషక విలువలు అన్ని సమృద్ధిగా నిండిన చియా సీడ్స్ మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతాయి. కాగా వీటివల్ల కలిగే లాభాలు చాలానే ఉన్నాయి. చియా సీడ్స్ రక్తంలో చక్కెర నిర్వహణను మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా బరువు తగ్గడానికి, గుండె సమస్యలకు, ఎముకలు దృఢంగా ఉన్నదానికి ఇవి ఉపయోగపడతాయి. అందుకే వీటిని చాలామంది తినడానికి ఇష్టపడుతూ ఉంటారు.
అంతేకాదు వీటిని స్మూతీలోనూ, సలాడ్స్ లోనూ.. ఎన్నో ముఖ్యమైన కలిపి తీసుకోవచ్చు. మరి దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
యాంటీ ఆక్సిడెంట్లు: చియా సీడ్స్ లో ఆంటీ ఆక్సిజన్ ఎక్కువగా ఉంటాయి. అందువలన శరీర కణాలపై దాడి చేసే క్రిములను చంపడంలో చియా విత్తనాల బాగా ఉపయోగపడతమే కాకుండా.. వృద్ధాప్యాన్ని కూడా నివారిస్తుంది.
ప్రోటీన్ విలువలు: ఈ సీడ్స్ అధిక-నాణ్యత ప్రోటీన్‌తో నిండి ఉన్నాయని మర్చిపోవద్దు. అందుకే, మనం వీటిని ఎక్కువగా తీసుకున్నప్పుడు, మనకు పెద్దగా ఆకలి గా అనిపించదు. తద్వారా మనము మేలుకొని ఉన్నా కానీ అర్థరాత్రి ఆకలి లేదా స్నాక్స్ తినాలనే కోరిక అదుపులో ఉంటుంది.
ఫైబర్: చియా విత్తనాలు దాదాపు 90 శాతం ఫైబర్‌తో నిండి ఉంటాయి. కాబట్టి ఈ విత్తనాలలో, స్టార్చ్ తక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ కరిగేది. మన గట్ కు మేలు చేసే ఆహారంగా ఉపయోగపడుతుంది. దీనివలన పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
బరువు తగ్గడానికి : ఈ విత్తనాలలో అధికంగా ఫైబర్, ప్రొటీన్ ఉండటం వల్ల ఇవి తీసుకున్నప్పుడు మీకు ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. మీ ఆకలి కోరికలను అధిగమించడంలో సహాయపడతాయి. తద్వారా బరువు తగ్గించడంలో ఇవి చాలా సహాయపడతాయి. అంతేకాదు 28 గ్రాముల చియా విత్తనాలలో 10 గ్రాముల డైటరీ ఫైబర్ ఉంటుంది. కాబట్టి రోజువారీ వినియోగం విసెరల్ కొవ్వు కణజాలం లేదా బొడ్డు కొవ్వును తగ్గిస్తుంది.
అందమైన చర్మం : ముందుగా చెప్పినట్టు చియా గింజల్లో అవసరమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడదంలో సహాయపడతాయి. ఇక అది చర్మం దెబ్బతినకుండా నిరోధించడంలో తోడ్పడుతుంది. ఇవి చర్మపు మంటనుంచి ఉపశమనం అందిస్తాయి. అంతే కాకుండా సూర్యరశ్మిలో దెబ్బతినకుండా చర్మం అవరోధాన్ని బలోపేతం చేస్తాయి.
Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంటే
Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి