Sapota Benefits: సపోటా పండ్లను వీరు అస్సలు తినకూడదు.. తింటే ఈ దుష్ప్రభావాలు తప్పవు..!

Sapota Benefits: నిత్యం చాలా మంది ఆరోగ్యంగా ఉండేందుకు అనేక రకాల ఫ్రూట్స్‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. అందులో ముఖ్యంగా సపోటా ఒక్కటి.  ఇది 30 నుంచి 40 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. వీటి ఆకులు గంట ఆకారంలో ఉండి ఆరు రెక్క‌ల‌తో ఉంటాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 29, 2022, 12:05 PM IST
  • సపోటా పండ్లను వీరు అస్సలు తినకూడదు..
  • గుండె సమస్యలతో బాధపడుతున్న వారు తినొద్దు
  • వైద్యుని సలహా మేరుకు తినాలి
Sapota Benefits: సపోటా పండ్లను వీరు అస్సలు తినకూడదు.. తింటే ఈ దుష్ప్రభావాలు తప్పవు..!

Sapota Benefits: నిత్యం చాలా మంది ఆరోగ్యంగా ఉండేందుకు అనేక రకాల ఫ్రూట్స్‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. అందులో ముఖ్యంగా సపోటా ఒక్కటి.  ఇది 30 నుంచి 40 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. వీటి ఆకులు గంట ఆకారంలో ఉండి ఆరు రెక్క‌ల‌తో ఉంటాయి. ఈ చెట్టుకు లేటెక్స్ జిగురు పరిమాణం అధికంగా ఉంటుది. వావున ఈ కాయలను చెట్టు నుంచి కోసిన తర్వాతే పండుతాయి. స‌పోటా పండు తియ్యని రుచిన కలిగి ఉంటాయి. ఈ పండులో విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ పరిమానం ఎక్కువ కనుక శరీరానికి చాలా రకాల లాభాలను చేకూర్చుతుంది.

స‌పోటా శరీరానికి చేసే లభాలు:

శరీరాన్ని అక్టివ్‌గా చేసేందుకు కృషి చేసుంది. అంతేకాకుండా  నీర‌సంగా ఉన్న వారు రెండు నుంచి నాలుగు పండ్లను తింటే ఇన్‌స్టంట్‌గా ప్రభావం చూపుతుందని నిపుణులు తెలుపుతున్నారు. వీటిలో ఫైబ‌ర్ పరిమాణం అధికంగా ఉండడం వల్ల మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య నుంచి దూర్ చేస్తుంది. అంతేకాకుండా వీటిని క్రమం తప్పకుండా తింటే.. విట‌మిన్ బి6, ఫోలేట్, ప్రోటీన్స్, కొవ్వులు, విట‌మిన్ సి, ఐర‌న్, ఫైబ‌ర్, పొటాషియం, కాప‌ర్, మెగ్నిషియం వంటి పోషకాలు లభిస్తాయి.

జీర్ణ క్రియను మెరుగు పరుతుంది:

స‌పోటా పండులో ఉండే గుణాలు జీర్ణ క్రియ మెరుగు పరిచేందుకు.. శరీరంలో ర‌క్త హీన‌త స‌మ‌స్య‌ను దూరం చేస్తుంది. అంతేకాకుండా కంటి చూపును పెంచేందుకు ఎంతగానో కృషి చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు బరువును నియంత్రించేందుకు సహాయపడుతుంది. కావున వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటిని పిల్లలకు రోజుకు ఒకసారి ఆహారంతో ఇవ్వడం వల్ల మంచి లాభాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ లాభాలు పొందుతారు:

స‌పోటాను క్రమం తప్పకుండా తినడం వల్ల చ‌ర్మ సౌదర్యం మెరుగుపడే అవకాశాలున్నాయని ఆయుర్వేద శాస్త్రం పేర్కొంది. అంతేకాకుండా వీటిలో తేనేను వేసుకుని ఉదయం పూట తినడం వల్ల పురుషులలో టెస్టోస్టిరాన్ సమస్యలు తొలగిపోతయాని నిపుణులు పేర్కొన్నారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరానికి మంచి లాభాలు పొందవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వీరు అస్సలు తినకూడదు:

గుండె సమస్యలతో బాధపడుతున్న వారు వీటిని తినే ముందు తప్పకుండా వైద్యుని సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా వీటిని బాలింత‌లు కూడా తినకూడదని నిపుణులు తెలుపుతున్నారు. వీటిని అతిగా తినడం వల్ల  క‌డుపు ఉబ్బ‌రం, పొట్టలో తిప్పడం వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read: Dil Raju Son: మరోసారి తండ్రైన దిల్ రాజు.. వారసుడు వచ్చేశాడుగా

Also Read: Meena Husband Vidyasagar: పావురాల వల్ల ప్రాణాలు కోల్పోయిన మీనా భర్త... అప్పట్లోనే జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం.. కానీ?

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News