Peach Health Benefits: పీచ్ పండు స్టోన్ కేటగిరీకి చెందింది. ఇది గింజ కలిగి ఉండే పండు. పీచ్ పండు మీ డైట్లో చేర్చుకుంటే లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పీచ్ పండు పచ్చిగా లేదా జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఈ పండు తీయ్యగా ఉంటుంది. కానీ, ఇందులో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పీచ్ పండులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అంతేకాదు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు కొన్ని కేన్సర్ సమస్యలకు దూరంగా ఉండొచ్చు. పీచ్ పండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.
జీర్ణ ఆరోగ్యం..
యూఎస్ డిపార్ట్‌మెంట్ అగ్రికల్చర్ ప్రకారం 100 గ్రాముల పీచ్ పండులో 1.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఫైబర్ జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతేకాదు డయేరియా, మలబద్ధకం సమస్య నుంచి బయటపడుతుంది.
బరువు తగ్గుదల..
పీచ్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గుదలకు తోడ్పడుతుంది. అంతేకాదు ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి ప్రేరేపిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ రెమిడీ.
కంటి ఆరోగ్యం..
పీచ్‌లో విటమిన్ ఏ, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కంటి చూపును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. క్యాటరాక్ట్ సమస్యలను తగ్గిస్తుంది.
చర్మ ఆరోగ్యం..
పీచ్ మన డైట్లో చేర్చుకోవడం వల్ల అల్ట్రా వైలేట్ కిరణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటీన్, విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మ ఆరోగ్యంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు..
పీచ్ లో పాలిఫినాల్స్, యాంటీ ఇన్ల్ఫమేటరీ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇన్ల్ఫామేటరీ గుణాలు ఉంటాయి. పీచ్ లో హిస్టామిన్, ఇన్ల్ఫమేటరీ సైటోకిన్ ల విడుదలను నిరోధిస్తుంది.
ఇదీ చదవండి: మెగ్నిషియం పుష్కలంగా ఉండే ఈ 10 ఆహారాలు మీ డైట్లో ఉన్నాయా? లేకపోతే నీరసం తప్పదు..
ఇమ్యూనిటీ వ్యవస్థ..
పీచ్ మన శరీర ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి. జలుబు బారిన పడకుండా ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. పీచ్ డైట్లో చేర్చుకుంటే రొంప సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది.
కేన్సర్ నివారిస్తుంది..
2013 అధ్యయనం ప్రకారం బ్రేస్ట్ క్యాన్సర్ రీసెర్చ్ అండ్ ట్రీట్మెంట్ జర్నల్ ప్రకారం ప్రతిరోజూ రెండు పీచ్‌లో డైట్లో చేర్చుకున్న మహిళల్లో బ్రేస్ట్ క్యాన్సర్ ప్రమాదం తగ్గింది. పీచ్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సీ, ఫీనొలిక్ కంపౌండ్లు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడతాయి.
ఇదీ చదవండి: పీరియడ్స్ మిస్సవ్వకూడదంటే ఈ 5 టిప్స్ పాటించండి.. సరైన టైమ్‌కు వచ్చేస్తుంది..
గుండె ఆరోగ్యం..
మీ శరీరంలో పొటాషియం లేమితో బాధపడుతుంటే పీచ్ డైట్లో చేర్చుకోవాలి. 100 గ్రాముల పీచ్‌లో 122 ఎంజీ పొటాషియం ఉంటుంది. యూఎస్‌డీఏ నివేదిక ప్రకారం పొటాషియం రక్తప్రసరణను నిర్వహిస్తుంది. గుండె ఆరోగ్యానికి సహకరిస్తుంది.
ప్రెగ్నెన్సీ..
పీచ్ లో ఉండే విటమిన్ సీ, ఫోలెట్ గర్భవతులకు ఎంతో ఆరోగ్యకరం. పీచ్‌లో ఉండే పోషకాలు వారి ఇమ్యూనిటీ వ్యవస్థను బూస్ట్ చేస్తుంది. ఇది ఐరన్ గ్రహించడానికి, ఫ్యాటల్ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ప్రెగ్నెన్సీ మహిళలు తప్పకుండా పీచ్ పండును తమ డైట్లో చేర్చుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి