Sapota Fruit: ప్రతిరోజు సపోటా తింటున్నారా..? అయితే ఆరోగ్యకరమైన జీవితం మీ సొంతం..!

Sapota Benefits: ప్రతి రోజు పండ్లు తీసుకోవడం శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పండ్లల్లో అందరికి నచ్చనే పండు సపోటా పండు. దీనిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు కలుగుతాయని నిపుణులు అంటున్నారు. సపోటా పండు తీసుకోవడం వల్ల వచ్చే లాభాలు ఎంతో మనం ఇప్పుడు తెలుసుకుందాం..    

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 27, 2023, 11:03 AM IST
Sapota Fruit: ప్రతిరోజు సపోటా తింటున్నారా..? అయితే ఆరోగ్యకరమైన జీవితం మీ సొంతం..!

sapota benefits: స‌పోటా పండు అనేది కాలానుగుణంగా దొరికే పండ్లల్లో ఒకటి. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. ఈ పండులో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఐరన్‌, కాపర్‌, పొటాషియం, ఫైబర్‌ ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయి. మలబద్దకం సమస్యతో బాధపడుతున్న వారు ప్రతిరోజు సపోటా పండు తీసుకోవడం వల్ల సమస్య నుంచి బయటపడవచ్చని వైద్యలు చెబుతున్నారు. 

సపోటా వల్ల కలిగే లాభాలు ఇవే..

సపోటా పండు తీసుకోవడం మెరుగైన కంటి చూపును పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
ఈ పండు తినడం వల్ల వృద్ధాప్య ఛాయ‌లు దూరం అవుతాయి.
రోగనిరోధక శక్తిని పెంచడంలో సపోటా పండు సహాయపడుతుంది. 
సపోటాను తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది.
రాత్రి పూట నిద్ర సమస్యతో బాధపడేవారు ఈ పండు తినడం వల్ల సుఖంగా నిద్రపోతారు.

Also read: Respiratory Problems: కరోనా కారణం కాదు.. దీనివల్ల కూడా శ్వాసకోశ సంబంధిత ప్రమాదం

కడుపుతో ఉన్న మహిళలు, పాలిచ్చే త‌ల్లులు కూడా వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మేలు క‌లుగుతుంది. 
న‌రాల ఒత్తిడిని,బ‌ల‌హీన‌త‌ను త‌గ్గించ‌డంలో స‌పోటా పండ్లు స‌హాయ‌ప‌డ‌తాయి.
స‌పోటా పండ్లు తిన‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య త‌గ్గుతుంది. 
 అధిక బ‌రువు త‌గ్గ‌డంలో, జుట్టు రాల‌డాన్ని త‌గ్గించ‌డంలో ఉపయోగపడుతుంది.
 శ‌రీరంలో వ‌చ్చే ఇన్ ప్లామేష‌న్ ను త‌గ్గించ‌డంలో అనేక విధాలుగా స‌పోటా పండ్లు స‌హాయ‌ప‌డ‌తాయి. 

స‌పోటా పండ్లు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తుంది. దీనిని ప్రతిరోజూ తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

Also read:  Vitamin B12 Side Effects: విటమిన్ బి12 మోతాదు దాటి తీసుకుంటే ఏమౌతుంది, ఎలాంటి దుష్పరిణామాలుంటాయి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News