Jackfruit Side Effects: అనేక మంది ప్రజలు ఆహారపు అలవాట్ల విషయంలో చాలా అలవాట్లు చేస్తుంటారు. అలా చేయడం వల్ల చాలా ఎదుర్కొవలసి వస్తుంది. ఉదాహరణకు పాలు, తేనె కలిపి తీసుకోకూడదు. కానీ, ఇలా తాగడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. అలా పాలు, తేనె కలిపి తాగడం వల్ల భవిష్యత్తులో అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొక తప్పదని కొందరు నిపుణులు అంటున్నారు. అయితే పనస కాయ తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలు తీసుకోకపోవడమే అందుకు మంచిదని అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలు తాగకూడదు..
పనస కాయ తిన్న తర్వాత వెంటనే పాలు తాగకూడదు. అలాగే పాలు తాగిన తర్వాత కూడా ఎలాంటి పండ్లు తినకూడదు. అలా చేయడం వల్ల చర్మ సమస్యలను ఎదుర్కొవాల్సి రావొచ్చు. దురద, చర్మంపై తెల్ల మచ్చలు, మొటిమలు మొదలైన చర్మవ్యాధులకు కారణాలు కావొచ్చు. దీంతో పాటు డయేరియా కూడా వచ్చే అవకాశం ఉంది.
తేనె తీసుకోకూడదు..
మనలో చాలామంది పండ్లు తిన్న తర్వాత తేనె తింటుంటారు. అయితే అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలా చేయడం ఆరోగ్యానికి చాలా హానికరం. అని నిపుణులు అంటున్నారు. పండ్లు తిన్న వెంటనే తేనె తీసుకోవడం వల్ల బ్లడ్ లో షుగర్ లెవర్ పెరిగే ప్రమాదం ఉంది. పండిన బొప్పాయి తిన్న తర్వాత కూడా తేనె, నెయ్యి వంటివి తీసుకోకూడదు.
(నోట్ : పైన పేర్కొన్న సమాచారమంతా నిపుణుల సలహా మేరకు పేర్కొనబడింది. వీటిని అనుసరించే ముందు సంబంధిత వైద్య నిపుణుడ్ని సంప్రదించడం మంచిది. ఈ సమాచారాన్ని ZEE తెలుగు News ధ్రువీకరిచడం లేదు.)
Also Read: Water Side Effects: అతిగా మంచినీరు తాగడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు!
Also Read: Jaggery Ghee Benefits: బెల్లం, నెయ్యి కలిపి తింటే ఈ రోగాలు మీ దరిచేరవు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.