Here is Some Easy Ayurvedic tips to reduce High Cholesterol: ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. వయసుతో పాటు శరీరంలో జీర్ణ శక్తి తగ్గడంతో.. శరీరంలో కొవ్వు పదార్థాలు పెరిగిపోతున్నాయి. దాంతో మానవ శరీరంలో హై కొలెస్ట్రాల్ భారీ స్థాయిలో ఉంటుంది. హై కొలెస్ట్రాల్ అత్యంత ప్రమాదకరం. హార్ట్ ఎటాక్స్, స్ట్రోక్స్‌కు ఇది దారి తీస్తుంది. ఒకసారి ఈ సమస్య వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాల్సిందే. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి ఆయుర్వేద ఆహార మార్పులు, యోగా ఆసనాలు మరియు ఇతర ఉపయోగకరమైన పద్ధతులు చేయాల్సి ఉంటుంది.
కొలెస్ట్రాల్ అనేది మైనపు లాంటి పదార్ధం. శరీరం తొలగించలేని కొవ్వు పదార్ధాలను తినడం ద్వారా అధిక కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. కొలెస్ట్రాల్ ధమనులపై ప్రభావం చూపుతుంది. కొలెస్ట్రాల్ హార్ట్ ఎటాక్స్, స్ట్రోక్స్‌కు ఇది దారి తీస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఆయుర్వేద చికిత్సలు, ఆహార నియంత్రణ, మసాజ్, యోగా, వ్యాయామం, హీట్ థెరపీ మరియు మూలికా సప్లిమెంట్ వంటి పద్ధతులు ఉన్నాయి. అయితే ఆయుర్వేదంతో సులభంగా కొలెస్ట్రాల్‌ను తగ్గించొచ్చని న్యూట్రిషనిస్ట్ మరియు వెల్‌నెస్ ఎక్స్‌పర్ట్ కరిష్మా షా చెప్పారు.
ఆయుర్వేదం ప్రకారం కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి కొన్ని చిట్కాలు:
1.ఆహారం మరియు జీవనశైలి మార్పులు:
కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి కఫాను నిర్వహించడం చాలా ముఖ్యం. కఫా బ్యాలెన్సింగ్ డైట్ చాలా అవసరం. కఫా డైట్ పాటిస్తే చాలా సులువుగా కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు.
2. కొత్తిమీర గింజలు:
చాలా కాలంగా కొత్తిమీర గింజలను వివిధ ఆయుర్వేద నివారణలలో ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఈ గింజల్లో ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మీ శరీరం యొక్క నిర్విషీకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి అద్భుతమైన నివారణగా చేస్తాయి.
3. మెంతి గింజలు:
మెంతి గింజలు, అకా మెంతి గింజలు ఆహారానికి రుచిని జోడిస్థాయి. అంతేకాదు మెంతి గింజలు పురాతన కాలం నుంచి ఔషధ గుణాల కోసం ఉపయోగించబడుతున్నాయి. ఈ గింజల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. వివిధ రకాల యాంటీ డయాబెటిక్, యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. అందుకే మెంతి గింజలు తరచూ వాడుతుండాలి.
4. ఆయిల్ తగ్గించాలి:
పామాయిల్ మరియు కొబ్బరి నూనెలో సంతృప్త కొవ్వు అధికంగా ఉంటుంది, ఇది LDL కొలెస్ట్రాల్ మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని అధికం చేస్తాయి. కాబట్టి వీటి వినియోగాన్ని తగ్గించాలి.
Also Read: బంగారం ప్రియులకు శుభవార్త.. తగ్గిన పసిడి ధర! హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి