Summer health Tips: వేసవిలో ఈ జాగ్రత్తలు పాటిస్తే.. ఆరోగ్యం మీ సొంతం!

Summer health Tips: వేసవి అంటే ఆరోగ్యపరంగా అనేక సమస్యలు వచ్చేందుకు అవకాశాలుంటాయి. మరి అలాంటి సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి? ఎండాకాలంలో పాటించాల్సి ఆరోగ్య సూత్రాలు ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 13, 2022, 03:50 PM IST
  • వేసవిలో తీసుకోవాల్సి జాగ్రత్తలు
  • ఎలాంటి ఆహారం తీసుకోవడం మంచింది
  • ఎండాకాలంలో పాటించాల్సిన టిప్స్​
Summer health Tips: వేసవిలో ఈ జాగ్రత్తలు పాటిస్తే.. ఆరోగ్యం మీ సొంతం!

Summer health Tips: ఎండాకాలం వచ్చేసింది.. ఆరంభంలోనే ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి. భానుడి ప్రతాపానికి బయట కొద్దిసేపు తిరిగితేనే చెమటలు పట్టడం, గొంతు ఎండిపోవటం వంటి ఇబ్బందులు వస్తున్నాయి. ఇంకొన్ని రోజులైతే.. ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశముంది. ఎండలు ఇంకా ముదిరితే.. వడదెబ్బ వంటి సమస్యలు కూడా వస్తుంటాయి.

అయితే ఎండాకాలంలో ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం.

ఆరోగ్యకమైన ఆహారాన్ని తీసుకోవడం..

ఎండాకాలంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం ఉత్తమం. అధికంగా కార్బోహైడ్రెట్స్​ ఎక్కువగా ఉండే ఆహారం తినడం శరీర ఊష్ట్రోగ్రత పెరిగే అవకాశముంది. అందుకే అధికంగా లిక్విడ్​ ఫుడ్స్ తీసుకోవడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తాజా పండ్లు, కూరగాయలలతో పాటు.. తరచు కొబ్బరి నీళ్లు, బత్తాయి వంటివి తీసుకోవాలని సూచిస్తున్నారు.

కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి..

ఎండ తీవ్రత వల్ల త్వరగా ప్రభావితమయ్యే శరీర భాగాల్లో కళ్లు ప్రధానమైనవి. అందుకే ఎండా కాలంలో కళ్ల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. బయటకి వెళ్లినప్పుడు సన్​ గ్లాసెస్​ పెట్టుకోవడం మంచింది. ముఖ్యంగా కళ్లు పూర్తిగా కవర్ అయ్యేలా కళ్లజోడు ఉంటే ప్రయోజనకరం

ఆల్కహాల్​కు దూరంగా ఉండటం మంచిది..

ఆల్కాహాల్​ శరీరాన్ని త్వరగా డీ హైడ్రేట్ చేస్తుంది. వేసవిలో డీ హైడ్రేట్ అవ్వడం అంచ మంచిది కాదు. అందుకే ఎండకాలంలో ఆల్కహాల్​కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. వైద్య నిపుణులు.

అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు..

వేసవిలో వీలైనంతవరకు ఇంట్లో లేదా నీడ ప్రాంతాల్లో ఉండేందుకు ప్రయత్నించాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఏదైనా పని ఉంటే ఉదయం, సాయంత్రం సమయాల్లో పెట్టుకోవాలని అంటున్నారు.

తరచూ నీళ్లు తాగాలి..

ఎండాకాలంలో చమట రూపంలో శరీరం ఎక్కువగా నీళ్లు ఖర్చు చేస్తుంది. అందుకే వీలైనంత వరకు ఎక్కువ నీళ్లు తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రయాణాలు చేస్తుంటే.. బాటల్​లో నీళ్లు తీసుకెళ్లడం మరిచిపోవద్దని సూచిస్తున్నారు.

Also read: weight loss Tips: ఈ సూప్‌లు బరువు తగ్గడంలో అద్భుతంగా పనిచేస్తాయి! రోజువారీ డిన్నర్ లో చేర్చుకోండి!

Also read: Beauty tips: ఈ చిట్కాలతో.. మొటిమల సమస్యకు ఇంట్లోనే చెక్​ పెట్టొచ్చట!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News