Eggs Side Effects in Summer: వాస్తవానికి గుడ్లు ఆరోగ్యానికి చాలా లాభదాయకమైనవి. ఎందుకంటే ఇందులో ప్రోటీన్లు, కాల్షియం వంటి పోషకాలు అత్యధికంగా ఉంటాయి. ఫలితంగా శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. గుడ్లు రోజూ తీసుకుంటే చాలా లాభాలుంటాయి. ఎముకలు పటిష్టమవడం, కండరాల పెరుగుదల ఉంటుంది. కానీ ఎండాకాలంలో గుడ్లు తినడం అనారోగ్య సమస్యలకు కారణమౌతుందట. ఆశ్చర్యంగా ఉందా..నిజమే. వేసవిలో గుడ్ల వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం..
కడుపులో వేడి పెరగడం:
వేసవిలో గుడ్లు తినడం వల్ల కడుపులో వేడి పెరిగిపోతుంది. ఎందుకంటే గుడ్ల స్వభావం వేడి చేసేది కావడమే. దాంతో బయటి వేడి, లోపలి వేడి రెండూ పెరిగిపోతాయి. ఫలితంగా కడుపు పాడవుతుంది. ఎసిడిటీ, మంట సమస్యలు తలెత్తుతాయి. అందుకే వేసవిలో సాధ్యమైనంతవరకూ గుడ్లకు దూరంగా ఉంటే మంచిది.
Also Read: Weight Loss Diet: బరువు తగ్గడానికి రోటీ బెటరా, రైస్ బెటరా? ఎలా వెయిట్ లాస్ అవుతారో తెలుసుకోండి!
జీర్ణక్రియ పాడవడం:
వేసవిలో గుడ్లు తినడం వల్ల జర్ణ సంబంధ సమస్యలు ఉత్పన్నమౌతాయి. కడుపు నొప్పి, అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. ఒకవేళ ఎండాకాలంలో గుడ్లు తినాల్సి వస్తే నీళ్లు ఎక్కువగా తాగాలి.
కిడ్నీలపై ప్రభావం:
ఎండాకాలంలో గుడ్లు తినడం వల్ల కిడ్నీలపై దుష్ప్రభావం పడుతుంది. ఎందుకంటే గుడ్లలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. గుడ్లు తినడం వల్ల కిడ్నీలపై ప్రోటీన్లను జీర్ణం చేసుకునేందుకు ఒత్తిడి పెరుగుతుంది. కిడ్నీ సమస్య ముందు నుంచే ఉంటే..గుడ్లు మానేయడం మంచిది.
Also Read: Weight Loss Tips: ఆరోగ్యంగా, వేగంగా బరువును తగ్గించే అద్భుత రసం ఇదే, సులభంగా చెక్ పెట్టొచ్చు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook