Influenza Virus: వేసవి భగభగల్నించి, ఎండ వేడిమి నుంచి, ఉక్కపోత నుంచి ఉపశమనం కల్గిస్తూ వచ్చేది వర్షాకాలం. అందుకే చాలామంది వర్షాకాలాన్ని ఇష్టపడతారు. అయితే అదే సమయంలో వివిధ రకాల వ్యాధుల ముప్పు కూడా వెంటాడుతుంది. ఇన్ఫెక్షన్ ప్రమాదం అధికంగా ఉంటుంది.
వర్షాకాలంలో సాధారణంగానే ఎక్కడపడితే అక్కడ నీళ్లు పేరుకుపోయి కన్పిస్తుంటాయి. వ్యర్ధాలు, నిల్వ నీటి కారణంగా దోమలు వ్యాప్తి చెందుతాయి. వర్షాకాలంలో దోమల బెడద తీవ్రంగానే ఉంటుంది. ఫలితంగా డెంగ్యూ, చికన్ గున్యా, టైఫాయిడ్, మలేరాయి వ్యాధుల ముప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. అన్నింటికీ మించి ఇన్‌ఫ్లూయెంజా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. అసలు ఇన్ఫ్లుయెంజా వైరస్ అంటే ఏంటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ వైరస్ నుంచి రక్షించుకునే మార్గాలేంటో పరిశీలిద్దాం.
వర్షాకాలంలో సాధారణంగా వైరల్ జ్వరాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో భాగంగానే ఇన్ఫ్లుయెంజా వైరస్ ముప్పు వెంటాడుతుంటుంది. ఇన్ఫ్లుయెంజా అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్, ఓ రకంగా చెప్పాలంటే ఫ్లూ లక్షణాలుంటాయి. ఇది ఓ రకమైన అంటువ్యాధి. శ్వాసకోశ వ్యవస్థలోని ముక్కు, గొంతు, ఊపిరితిత్తులపై ఈ వైరస్ దాడి చేస్తుంది. ఇన్ఫ్లుయెంజా వైరస్ సోకితే తలనొప్పి, వాంతులు, మలబద్ధకం, దగ్గు, కండరాల్లో నొప్పి, బాడీ పెయిన్స్, జ్వరం లేదా ఒళ్లంతా చల్లబడినట్టుండటం, అలసట, ముక్కు కారడం, గొంతులో గరగర ప్రధాన లక్షణాలుగా ఉంటాయి.
ఇన్ఫ్లుయెంజా వైరస్ సోకడానికి ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయి. కలుషితమైన చేతులతో సున్నితమైన అంగాలైన పెదాలు, కళ్లు, ముక్కుని తాకడం, రోగి దగ్గు లేదా తుమ్మలు, డ్రాప్లెట్స్, బలహీనమైన ఇమ్యూనిటీ, పాతరోగం ఏదైనా తిరగబెట్టడం, గర్బిణీలు 2-3వ నెలల్లో ఇన్ఫ్లుయెంజా వైరస్‌కు గురి కావడం, వాతావరణంలో మార్పులు.
అందుకే వర్షాకాలంలో ఎప్పుడూ హెల్తీ పుడ్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. మరీ ముఖ్యంగా ఇంటి ఆహారమే తినాలి. బయటి ఆహారాన్ని పూర్తిగా మానేయాలి. జంక్ ఫుడ్స్ దూరం పెట్టాలి. దోమల్నించి ఎప్పటికప్పుడు రక్షించుకోవాలి. ఇమ్యూనిటీ పటిష్టం చేసుకునేందుకు, త్వరగా ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండేందుకు విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు తినాలి. మన ఇంటితో పాటు చుట్టుపక్కల పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. వర్షంలో తడవకూడదు. ఎక్కువ నీళ్లు తాగాలి. రద్దీగా ఉండే ప్రాంతాల్లో తిరగకుండా ఉంచే మంచిది. ఇన్ఫ్లుయెంజా వైరస్ సోకకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
Also read: Uric Acid vs lemon: నిమ్మకాయ నీళ్లు తాగితే యూరిక్ యాసిడ్ సమస్య తగ్గుతుందా, నిజానిజాలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook