Fatty Liver Problem: ఫ్యాటీ లివర్‌కు ఈ 5 పదార్ధాలు విషంతో సమానం

Fatty Liver Problem: మనిషి ఆరోగ్యం అనేది ఎప్పుడూ తినే ఆహారాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి. లేకపోతే ప్రాణాంతక పరిస్థితులకు దారి తీయవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 22, 2024, 07:16 PM IST
Fatty Liver Problem: ఫ్యాటీ లివర్‌కు ఈ 5 పదార్ధాలు విషంతో సమానం

Fatty Liver Problem: మనిషి శరీరంలో గుండె, కిడ్నిలు ఎంత ముఖ్యమో లివర్ కూడా అంతే ముఖ్యమైన అంగం. లివర్ అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కూడా కావచ్చు. కడుపు చుట్టూ పేరుకుపోయే బెల్లీ ఫ్యాట్ కూడా లివర్ వ్యాధికి కారణ కావచ్చు. ఫ్యాటీ లివర్ అనేది ఆల్కహాలిక్, నాన్ ఆల్కహాలిక్ రెండు రకాలుగా ఉంటుంది. స్థూలకాయంతో పాటు డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. 

ఫ్యాటీ లివర్ అనేది సాధారణంగా చాలమందిలో ఉంటుంది. కానీ పైకి కన్పించదు. ఎందుకంటే ప్రారంభ లక్షణాలు గుర్తించలేం. అందుకే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంటే అప్రమత్తం కావల్సి ఉంటుంది. బెల్లీ ఫ్యాట్ లేకుండా ఉండాలంటే ముఖ్యంగా డైట్ నుంచి 5 రకాల పదార్ధాలు దూరం చేయాల్సి ఉంటుంది. 

రెడ్ మీట్ శాట్యురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉంటుంది. అందుకే ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నప్పుడు మటన్, బీఫ్, పోర్క్ వంటివాటికి దూరంగా ఉండాలి. ఇక డైట్ నుంచి దూరం చేయాల్సిన మరో ముఖ్యమైన పదార్ధం వైట్ బ్రెడ్. ఎందుకంటే ఇది పూర్తిగా ప్రోసెస్డ్ అయుంటుంది. దాంతో ఈ పదార్ధాల్లో ఫైబర్ పరిణామం తక్కువగా ఉంటుంది. ఇవి తినడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. అందుకే వైట్ బ్రెడ్, బియ్యం, పాస్తా వంటివాటికి దూరంగా ఉండాలి.

మద్యపానం అనేది కేవలం లివర్ పైనే కాకుండా మొత్తం ఆరోగ్యంపైనే తీవ్ర ప్రభావం చూపిస్తుంటుంది. ఫ్యాటీ లివర్ సమస్య తలెత్తకుండా ఉండాలంటే మద్యపానంకు పూర్తిగా దూరం పాటించాలి. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారికి మద్యపానం కొద్దిగా ఉన్నా సరే సమస్యే. 

క్యాండీ, కుకీస్, సోడా , ప్రూట్ జ్యూస్ వంటి షుగర్‌తో చేసే పదార్ధాలు దూరం పెట్టాలి. లేకపోతే ఫ్యాటీ లివర్ సమస్య మరింత జటిలం కావచ్చు. ఎందుకంటే హై బ్లడ్ షుగర్ అనేది ఫ్యాటీ లివర్ సమస్యను మరింత పెంచుతుంది. దీంతో పాటు ఉప్పు ఎక్కువగా ఉండే పదార్ధాలకు దూరంగా ఉండాలి. రోజుకు 2300 మిల్లిగ్రాముల కంటే తక్కువ సోడియం తీసుకోవాలి. హై బ్లడ్ ప్రెషర్ ఉండేవాళ్లయితే రోజుకు 1500 మిల్లీగ్రాములు దాటకూడదు. 

Also read: Green Beans: గ్రీన్ బీన్స్ వల్ల కలిగే ఆరోగ్య లాభాలు ఏంటో తెలుసుకుందాం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News