Maruti Suzuki Dzire Modal 2025: భారత మార్కెట్లోకి మారుతి సుజుకి Dzire కొత్త మోడల్ విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో లాంచ్ కానుంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Maruti Suzuki Dzire Modal 2025: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి గుడ్ న్యూస్ తెలిపింది. ఆటో ఎక్స్పో 2025లో భాగంగా అద్భుతమైన కొత్త ఎడిషన్ కారును పరిచయం చేసింది. ఈ కారు ప్రీమియం ఫీచర్స్‌తో పాటు అద్భుతమైన లుక్‌లో కనిపించబోతోంది. అలాగే ప్రత్యేకమైన కలర్ ఆప్షన్స్‌ను కూడా కలిగి ఉండబోతోంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలేంటో? ఇంతకీ ఈ కారేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రస్తుత డిజైర్ మోడల్‌కి మార్కెట్లో అద్భుతమైన డిమాండ్ ఉంది. ఇది అత్యంత తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఆటో ఎక్స్పో 2025లో ఈ డిజైర్ కారుకు అప్డేట్ వేరియంట్, కొత్త ఎడిషన్ అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈ మారుతి సుజుకి డిజైర్ 2025 కారు చూడడానికి చాలా ప్రీమియం లుక్‌లో కనిపించబోతోంది. ఈ అర్బన్ లక్స్ ఎడిషన్ బాడీ చాలా విభిన్నంగా ఉంటుంది. అంతేకాకుండా ఫ్రంట్ గ్రిల్, నోస్, డోర్ ప్యానెల్‌ను ఈ ఎడిషన్‌లో చాలా వరకు మార్చినట్లు తెలుస్తోంది. అలాగే ఈ కారులో స్టైలిష్ క్రోమ్ యాక్సెంట్స్ కూడా లభించనున్నాయి.
మారుతి సుజుకి డిజైర్ 2025 కారు 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ డ్రైవింగ్ సిస్టమ్‌ను కూడా అందిస్తోంది. అలాగే ప్రత్యేకమైన Android Autoతో పాటు Apple CarPlay సెటప్‌లను కూడా అందిస్తోంది.
ఇందులో ప్రత్యేకమైన వైర్లెస్ కనెక్టివిటీను కూడా మారుతి సుజుకి అందిస్తోంది. అలాగే మొట్టమొదటి సారిగా ఈ కారులో క్రూయిజ్ కంట్రోల్‌తో పాటు సింగిల్-పేన్ సన్‌రూఫ్ ఆప్షన్ కూడా అందిస్తోంది. ఈ కారు ఏడు వైబ్రెంట్ కలర్ ఆప్షన్స్‌ను కలిగి ఉండబోతోంది.
ఈ కారు మార్కెట్లోకి లాంచ్ అయితే ఇటీవలే విడుదలైన డిజైర్ హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరాతో పాటు టాటా టిగోర్ కార్లతో పోటీ పడనుంది. అలాగే ఇందులో శక్తివంతమైన 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను కూడా అందిస్తోంది.
మారుతి సుజుకి డిజైర్ 2025 కారు ఇంజన్ 81.58 bhp గరిష్ట పవర్ అవుట్‌పుట్‌తో పాటు 111.7 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇక దీని ధర వివరాల్లోకి వెళితే.. ధర రూ. 6.79 లక్షల ఎక్స్-షోరూమ్ నుంచి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులోనే టాప్ వేరియంట్ రూ. 10.14 లక్షలు ఉండే అవకాశాలు ఉన్నట్లు సమాచారం..