న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో చాలా రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడి పోయాయి. తద్వారా జోమాటో, స్విగ్గిలు కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. 21 రోజుల లాక్‌డౌన్ ఆదేశం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రధాన ప్రధాన హోటళ్లు డెలివరీ అబ్బాయిలను స్థానిక పోలీసులు అధికారులు వెనక్కి పంపారు.
Also Read: రాబోయే 2 వారాలు చాలా కీలకం: కేంద్రం
ఆహరం అత్యవసర సేవలే అయినప్పటికీ, ప్రజలకు అందుబాటులోకి ఉండాలని ప్రయత్నిస్తున్నప్పటికీ తీవ్రమైన అడ్డంకులు ఎదుర్కొంటున్నామని జొమాటో, స్విగ్గీ ప్రతినిధులు తెలియజేస్తున్నారు. హోమ్ డెలివరీ’ ని అవసరమైన సేవల్లో ఒకటిగా పేర్కొన్న ప్రభుత్వ ఆదేశాలను అధికారులు తుంగలో తొక్కుతున్నారని, అవసరమైన సేవలు ఇబ్బంది లేకుండా పనిచేయడానికి వీలుగా లేకుండా గందరగోళాన్ని సృష్టిస్తున్నారని జోమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ట్వీట్ చేశారు.
Read also : గాళ్ ఫ్రెండ్‌తో హార్ధిక్ పాండ్య రొమాన్స్.. వైరల్‌గా మారిన క్వారంటైన్ పిక్
ఇది స్వల్పకాలిక సమస్యగా ఉంటుందని ఆశిస్తున్నామని, అధిక సంఖ్యలో నగరాల్లో హోటళ్లు మూసివేయడంతో సరఫరాపై తీవ్ర అంతరాయం కలుగుతుందని స్విగ్గి పేర్కొంది. అయినప్పటికి ఇటువంటి కఠినమైన పరిస్థితుల్లో ప్రజలకు అత్యవసర సేవలు అందించడానికి తాము కార్యాచరణ రూపొందించామని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. తమకు హోటళ్లు భాగస్వామ్య రుసుము తగ్గించినప్పటికీ సేవలందించడానికి సిద్ధంగా ఉన్నామని, నిలిపివేయమని, కొనసాగిస్తామని అన్నారు. జీ హిందుస్తాన్
తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..