సన్నీ లియోన్ బయోపిక్ సిరీస్ ట్రైలర్ రిలీజ్

సన్నీ లియోన్ తన నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన "కరణ్‌జీత్ కౌర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోన్" జీ5 వెబ్ సీరిస్‌గా ప్రసారం కాబోతోంది.

Last Updated : Jul 6, 2018, 04:01 PM IST
సన్నీ లియోన్ బయోపిక్ సిరీస్ ట్రైలర్ రిలీజ్

బాలీవుడ్ నటి సన్నీ లియోన్ నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన "కరణ్‌జీత్ కౌర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోన్" జీ5 వెబ్ సీరిస్‌గా ప్రసారం కాబోతోంది. ఈ సిరీస్‌కు సంబంధించిన లేటెస్ట్ ట్రైలర్ ఇటీవలే విడుదలైంది.

ఈ బయోపిక్‌లో ఒక మధ్యతరగతి సిక్కు కుటుంబం నుండి వచ్చిన సన్నీ లియోన్.. ఎలాంటి సమస్యలను అధిగమించడానికి అడల్ట్ సినిమా ఇండస్ట్రీలో నటించింది..అందుకు గల కారణాలేమిటి.. ఆ తర్వాత ఆమె బాలీవుడ్ చిత్రాలలో నటించిన వైనం ఇత్యాది అంశాలు అన్నీ కూడా దర్శకుడు తెరపై చూపించనున్నారు. ఆదిత్య దత్ ఈ  బయెపిక్‌కి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇదే బయోపిక్‌లో రాజ్ అర్జున్, రైసా సౌజానీ, కరంవీర్ లాంబా, బిజయ్ జస్జీత్ ఆనంద్ మొదలైనవారు నటిస్తున్నారు. నటి రైసా సౌజానీ చిన్నప్పటి సన్నీ లియోన్ పాత్రలో ఈ చిత్రంలో నటిస్తున్నారు. 

జిస్మ్ 2 చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన సన్నీ లియోన్, ఆ తర్వాత అనేక సినిమాల్లో ఐటెం సాంగ్స్‌లో నటించారు. తెలుగులో కూడా కరెంటు తీగ, గరుడవేగ చిత్రాలలో ఆమె నటించింది. అలాగే మరాఠీ, కన్నడ, తమిళ సినిమాల్లో కూడా నటించారు. రేస్, బాద్షాహో చిత్రాల్లో కూడా ప్రత్యేక గీతాల్లో కనువిందు చేశారు. రాగిణి ఎంఎంఎస్ 2, మస్త్ జాదే, వన్ నైట్ స్టాండ్, బైమాన్ లవ్ చిత్రాలలో సన్నీ ప్రధాన పాత్రలలో నటించింది.

Trending News