Nandamuri Taraka Ramarao: మరణం లేని మహానుభావుడు ఎన్టీఆర్.. ఆ మూడు అక్షరాలు పెను సంచలనం: నందమూరి మోహన కృష్ణ

NTR 28th Death Anniversary: ఎన్టీఆర్ 28వ సందర్భంగా ఫిల్మ్‌నగర్‌లోని ఆయన విగ్రహానికి  నందమూరి మోహన్ కృష్ణ, నందమూరి మోహన రూపా, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మరణం లేని మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 19, 2024, 12:01 AM IST
Nandamuri Taraka Ramarao: మరణం లేని మహానుభావుడు ఎన్టీఆర్.. ఆ మూడు అక్షరాలు పెను సంచలనం: నందమూరి మోహన కృష్ణ

NTR 28th Death Anniversary: నందమూరి తారక రామారావు 28వ వర్ధంతిని తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిలింనగర్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన కుటుంబ సభ్యులు నందమూరి మోహన్ కృష్ణ, నందమూరి మోహన రూపా, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. ఈ సందర్భంగా మాగంటి మాట్లాడుతూ.. మరణం లేని మహా నాయకుడు నందమూరి తారక రామారావు అని కొనియాడారు. సినీ పరిశ్రమలోనూ, రాజకీయాల్లోనూ ఎదురులేని మనిషిగా నిలబడిన గొప్ప వ్యక్తి అని అన్నారు. ఆ మహానీయుడు భౌతికంగా మనకు దూరమై 28 ఏళ్లు గడిచినా.. ఆయనను ఇలా సత్కరించుకోవడం ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ విషయమని అన్నారు. మన దేశంలోనే ఎవరికీ దక్కని గౌరవం ఆయన సొంతం అని.. ఫిలింనగర్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.

1982లో పార్టీని స్థాపించి 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే మాగంటి గుర్తు చేశారు. అలా పార్టీ పెట్టి తనలాంటి ఎంతోమందికి ఆదర్శంగా నిలబడ్డారని గుర్తు చేసుకున్నారు. తెలుగువారు ఉన్నంతకాలం ఎన్టీఆర్‌ను మరిచిపోవడం కష్టమన్నారు. ఆయన ఎల్లపుడూ ప్రజల గురించే ఆలోచించేవారని అన్నారు. ఆయన తీసుకువచ్చిన పథకాలే దేశం అంతటా ఈరోజుకి అమలు చేస్తుండడం గర్వించదగ్గ విషయమన్నారు.

అనంతరం నందమూరి మోహన కృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు పెను సంచలనం అని అన్నారు. సినిమాల్లో, రాజకీయాల్లో ఈ పేరు చెరగని ముద్ర వేసుకుందన్నారు. సినిమాల్లో ఆయన చేయని పాత్ర లేదన్నారు. రాజకీయ పరంగా పెను మార్పులు తీసుకువచ్చారని చెప్పారు. ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ మనుషులలో దైవం అని అన్నారు. 

తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. మరణం లేని మహానుభావుడు ఎన్టీఆర్ అని అన్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా, హాలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని రకాలుగా మాట్లాడుతున్నామని.. కానీ ఎన్టీఆర్‌కు ఇలాంటి ఎప్పుడో వచ్చినా.. తిరస్కరించి తెలుగు జాతి కోసం నిలబడ్డారని గుర్తు చేశారు. పేద ప్రజల కోసం ఏదైనా చేయాలని పార్టీని స్థాపించి.. తాను సంపాదించిన దాంట్లో ప్రజల కోసం సేవ చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.

Also Read: EPFO Nominee Rules: పీఎఫ్ నామినీగా కొడుకు, కుమార్తెను చేర్చవచ్చా, ఎవరికి అవకాశం లేదు

Also Read: EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. గడువు పెంచుతూ EPFO కీలక నిర్ణయం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News