Veerasimha Reddy: ''వీర సింహారెడ్డి''గా బాలయ్య.. పూనకాలు తెప్పించేలా 107 టైటిల్ అనౌన్స్మెంట్!

Veerasimha Reddy Title Announced for NBK107: ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే బాలకృష్ణ 107 మూవీ టైటిల్ ను అనౌన్స్ చేసింది సినిమా యూనిట్. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 21, 2022, 08:20 PM IST
Veerasimha Reddy: ''వీర సింహారెడ్డి''గా బాలయ్య.. పూనకాలు తెప్పించేలా 107 టైటిల్ అనౌన్స్మెంట్!

Veerasimha Reddy Title Announced for NBK107: బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరియర్లో 107వ సినిమా చేస్తున్నారు. క్రాక్ సినిమాతో హిట్ కొట్టి మళ్ళీ లైన్లోకి వచ్చిన గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఈ సినిమా రూపొందుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో శృతిహాసన్ హీరోయిన్ గా రూపొందుతున్న ఈ సినిమా నుంచి విడుదలైన కొన్ని పోస్టర్లు సినిమా మీద భారీగా అంచనాలు పెంచేశాయి.

బాలకృష్ణ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపిస్తూ ఉండడంతో సినిమా మీద అటు బాలకృష్ణ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం ఆసక్తి ఏర్పడింది. ఇప్పటివరకు ఈ సినిమాని బాలకృష్ణ 107వ సినిమా అని సంబోధిస్తూ ఉండగా సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా టైటిల్ రివీల్ చేయడం కోసమే కర్నూలు కొండారెడ్డి బురుజు వేదికగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఒక ఈవెంట్ నిర్వహిస్తోంది. సరిగ్గా ఎనిమిది గంటల 15 నిమిషాలకు ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసింది సినిమా యూనిట్.

ముందు నుంచి ఈ సినిమాకి అన్నగారు, రెడ్డిగారు, వీర సింహారెడ్డి వంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి తగినట్లుగానే వీర సింహారెడ్డి అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో కన్నడ స్టార్ యాక్టర్ దునియా విజయ్ విలన్ పాత్రలో నటిస్తుండగా తమిళ స్టార్ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తోంది.

ఇక ఈ సినిమాని సంక్రాంతి 2022 సీజన్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు ముందు నుంచి ప్రచారం జరిగింది. అయితే ఈ రిలీజ్ డేట్ మీద ఇప్పటి వరకు కొనసాగిన సస్పెన్స్ ని కొనసాగిస్తూనే రిలీజ్ డేట్ మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. ఇక తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ లోగోతో ఫాన్స్ అయితే మంచి జోష్ లో ఉన్నారు. 

Also Read: Prince Movie Report: కామెడీతో అన్ని సినిమాలూ జాతి రత్నాలు అవ్వలేవు బాసూ!

Also Read: Samantha Ruth Prabhu Bold Pics : సమంత గ్లామర్ ఫోటోలు షేర్ చేసిన సాధన సింగ్.. సామ్ ఫ్రెండ్‌పై నెటిజన్ ఫైర్.. రిప్లై హైలెట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News