Shah Rukh Khan on Ram Charan షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ ట్రైలర్ ఇప్పుడు నేషనల్ వైడ్‌గా అట్రాక్ట్ చేస్తోంది. యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ అదిరిపోయాయ్ అని అంతా కామెంట్లు పెడుతున్నారు. షారుఖ్ పఠాన్ సినిమాతో కమ్ బ్యాక్ అయ్యేలా ఉన్నాడు. షారుఖ్ నటించిన ఈ చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. పఠాన్ సినిమా జనవరి 25న విడుదల కాబోతోంది. అయితే ఈ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ అందరినీ మెప్పిస్తోంది.
పఠాన్ ట్రైలర్ మీద రామ్ చరణ్ స్పందించాడు. ట్రైలర్‌ను షేర్ చేసిన రామ్ చరణ్‌కు షారుఖ్ రిప్లై ఇచ్చాడు. షారుఖ్ వేసిన ట్వీట్, రామ్ చరణ్ గురించి చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్‌ను తెలుగులో రామ్ చరణ్, తమిళంలో విజయ్ షేర్ చేశారు. దీంతో ఈ ఇద్దరికే షారుఖ్ రిప్లై ఇచ్చాడు. రామ్ చరణ్ గురించి చెబుతూనే ఆర్ఆర్ఆర్, ఆస్కార్ గురించి మాట్లాడేశాడు.
Thank u so much my Mega Power Star @alwaysramcharan. When ur RRR team brings Oscar to India, please let me touch it!!
(Mee RRR team Oscar ni intiki tecchinappudu okkasaari nannu daanini touch cheyyanivvandi! )
Love you.— Shah Rukh Khan (@iamsrk) January 10, 2023
థాంక్యూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఎప్పుడైతే మీ ఆర్ఆర్ఆర్ టీం ఆస్కార్‌ను తీసుకొస్తుందో.. ఒకసారి దాన్ని టచ్ చేసే అవకాశాన్ని నాకు ఇవ్వు.. మీ ఆర్ఆర్ఆర్ టీం ఆస్కార్‌ను ఇంటికి తెచ్చినప్పుడు ఒకసారి నన్ను దాన్ని టచ్ చేయనివ్వండి అని ట్వీట్ వేశాడు. ఇక విజయ్‌ని సైతం ఆకాశానికి ఎత్తేశాడు షారుఖ్.
థాంక్యూ మై ఫ్రెండ్ విజయ్.. నువ్ ఇలా హంబుల్‌గా ఉంటావ్ కాబట్టే దళపతివి అయ్యావ్.. మరోసారి మీ ఇంటి వంటలను రుచి చూడాలని ఉంది.. అంటూ షారుఖ్ ట్వీట్ వేశాడు. మొత్తానికి ఈ సారి మాత్రం షారుఖ్ హిట్ కొట్టేలానే ఉన్నాడు. వార్ సినిమాతో సిద్దార్థ్ ఆనంద్ మ్యాజిక్ చేయగా.. మళ్లీ పఠాన్ సినిమాతో మెస్మరైజ్ చేయబోతోన్నట్టు కనిపిస్తోంది.
Also Read: Shaakuntalam Trailer.. శాకుంతలం ట్రైలర్.. మెస్మరైజ్ చేసిన సమంత.. అల్లు అర్హ ఎంట్రీ అదుర్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి