Ruhani Sharma - Akanksha singh : హగ్స్ చేసుకున్నాం.. ముద్దులు పెట్టుకున్నాం!.. రుహానీ, ఆకాంక్షలు తేడాగా ఉన్నారే?

Nani Hero Sister: సెట్‌లో నటీనటులు ఎంత సరదాగా ఉంటారో అందరికీ తెలిసిందే. కొన్ని సార్లు సినిమా యూనిట్‌ అంతా కూడా కుటుంబంలా కలిసిపోతుంది. మీట్ క్యూట్ యూనిట్ కూడా అలానే అయినట్టుంది. ఇందులో మరీ ముఖ్యగా ఆకాంక్ష సింగ్, రుహానీ శర్మలు మరింతగా క్లోజ్ అయినట్టు కనిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 22, 2022, 11:42 AM IST
  • నవంబర్ 25న రాబోతోన్న మీట్ క్యూట్
  • ప్రీ స్ట్రీమింగ్ సెలెబ్రేషన్స్‌లో హీరోయిన్ల సందడి
  • ఆకాంక్ష సింగ్, రుహానీ శర్మల రిలేషన్ ఇదే
Ruhani Sharma - Akanksha singh : హగ్స్ చేసుకున్నాం.. ముద్దులు పెట్టుకున్నాం!.. రుహానీ, ఆకాంక్షలు తేడాగా ఉన్నారే?

Ruhani Sharma Akanksha singh Relation : నాని సోదరి దీప్తి ఘంటా దర్శకురాలిగా మీట్ క్యూట్ సినిమాతో తెలుగు వారిని మెప్పించేందుకు వస్తోంది. సోనీ లివ్‌లో ఈ వెబ్ సిరీస్‌ నవంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న మూవీ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ క్రమంలో హీరోయిన్లుగా నటించిన రుహానీ శర్మ, ఆకాంక్ష సింగ్‌ల మధ్య రిలేషన్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఈవెంట్‌లో రుహానీ శర్మ మాట్లాడుతూ.. నా లైఫ్‌లో చాలా మీట్ క్యూట్ మూమెంట్స్ ఉన్నాయి.. కానీ ఇప్పుడు ఈ సినిమాలో మాత్రం ఆకాంక్షతో అలాంటి మీట్ క్యూట్‌ మూమెంట్స్ఉన్నాయి.. సినిమా షూటింగ్ ప్రారంభ సమయంలో మా ఇద్దరికీ పరిచయం లేదు.. నాకు అంతగా తెలియదు.. ఆమె సినిమాలు తెలుసు గానీ.. ఆమెతో పరిచయం లేదు.. ఎయిర్‌ పోర్టులో కలిశాం. ఒకే కారులో వచ్చాం.. పదిహేను నిమిషాల తరువాత మేం మంచి స్నేహితులుగా మారాం.

అదే రోజులో మేం చాలా చేశాం.. కలిసి తిన్నాం.. చాటింగ్ చేసుకున్నాం.. హోటళ్ల కోసం తిరిగాం.. ఆ రోజంతా ఆగనే లేదు.. హగ్స్ చేసుకుంటూ ఉన్నాం.. ముద్దులు పెట్టుకుంటూ ఉన్నాం.. నాకు ఒక సోల్ మేట్‌ దొరికిందని అనుకున్నాం.. అదే నా మీట్ క్యూట్.. సెట్‌లో చాలా మీట్ క్యూట్ మూమెంట్స్ ఉన్నాయ్.. దీప్తి, సత్యరాజ్‌ వంటి వారితో పని చేయడం ఆనందంగా ఉంది అంటూ ఇలా తన స్పీచ్ కంటిన్యూ చేస్తూ పోయింది.

మీట్ క్యూట్‌లో ఐదు స్టోరీలు ఉన్నాయి. ఐదు ఎపిసోడ్‌లుగా దీన్ని తీశారు. ఒక్కో జంట తమ బెస్ట్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇక పాటలు మాత్రం ఎంతో వినసొంపుగా ఉన్నాయి. సంగీతంతో పాటు లిరిక్స్ కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి నాని సోదరికి హిట్టు పడేలానే కనిపిస్తోంది. నాని బ్యానర్ నుంచి మరో ప్రామిసింగ్ ప్రాజెక్ట్ వచ్చేసినట్టు అనిపిస్తోంది.

Also Read : Bigg Boss Satya : బిగ్ బాస్ దెబ్బకు మాడిపోయింది.. అసలు రూపం బయటపడింది.. తెల్లమొహమేసిన సత్య

Also Read : Nani Sister Deepthi : సెట్‌లో హీరోయిన్లతో నాని అక్క అలా చేయించుకుందా?.. సినిమా ఆఫర్‌ కోసం ఇలానా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News