Telangana BJP : తెలంగాణ నేతలపై బీజేపీ హైకమాండ్ సీరియస్, ఇలా ఐతే ఊరుకోమంటూ నేతలకు వార్నింగ్..!

Telangana BJP : తెలంగాణ నేతలపై బీజేపీ హైకమాండ్ సీరియస్ గా ఉందా...? పార్టీ విషయలో నేతల తీరుపై బీజేపీ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారా..? నేతలకు పార్టీ కన్నా సొంత రాజకీయాలే ముఖ్యం అయిపోయాయా అన్న భావనలో హైకమాండ్ ఉందా..? ఇంతకీ తెలంగాణ బీజేపీ నేతలు ఆ విషయంలో ఎందుకు ఫెయిల్ అయ్యారు..? బీజేపీ పెద్దలు ఆ నేతలపై పెట్టుకున్న కొండంత ఆశలు  ఎందుకు ఆవిరి అయ్యాయి..? అసలు తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు...? 

Written by - Indupriyal Radha Krishna | Last Updated : Oct 5, 2024, 02:29 PM IST
Telangana BJP : తెలంగాణ నేతలపై బీజేపీ హైకమాండ్ సీరియస్, ఇలా ఐతే ఊరుకోమంటూ నేతలకు వార్నింగ్..!

Telangana BJP : దక్షిణాదిలో ఎలాగైనా పట్టు సాధించాలని బీజేపీ పెద్దలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు దక్షిణాదిలో కేవలం కర్ణాటకలో మాత్రమే బీజేపీ చాలా బలంగా ఉంది.అంతే కాదు కర్ణాటకలో పలు మార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర ఉంది. అదే సందర్భంలో మిగితా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకీ కనీసం చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు కూడా లేదు. కానీ గత పదేళ్లుగా క్రమక్రమంగా దక్షిణాదిలో కూడా బీజేపీ ఓటు బ్యాంకును పెంచుకుంటు పోతుంది. కేంద్రంలో అధికారంలో ఉండడంతో పాటు ప్రధాని మోదీ ఛరిష్మా బీజేపీ బలపడడానికి ఉపయోగపడింది.దీంతో కర్ణాటకతో తెలంగాణలో కూడా బీజేపీనీ బలపర్చడానికి మోదీ,అమిత్ షా ద్వయం వ్యూహాలు అమలు చేస్తున్నారు.

 గత పదేళ్లుగా తెలంగాణలో కూడా బీజేపీ చాలా బలం పుంజుకుంది. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకీ 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఆ పార్టీకీ ప్రజల్లో పెరిగిన బలం సూచిస్తుంది. ఇదే సందర్భంలో బీజేపీనీ మరింత బలపర్చడానికి బీజేపీ పెద్దలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా బీజేపీ హైకామండ్ పావులు కదుపుతుంది.బీజేపీ పెద్దల ఆలోచన ఈవిధంగా ఉంటే తెలంగాణ బీజేపీ నేతల ఆలోచన మరో విధంగా ఉంది. ఒక వైపు పార్టీనీ బలోపేతం చేయాలని హైకమాండ్  భావిస్తుంటే ఇక్కడి నేతలు చాలా లైట్ గా తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. దానికి కారణం ఇటీవల దేశ వ్యాప్తంగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది

. దేశ మొత్తం యమ స్పీడ్ గా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుంటే తెలంగాణలో మాత్రం నత్తనడకన కొనసాగుతుందంట. ఐతే తెలంగాణ ఈ సారి పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు జరుగుతుందని జాతీయ బీజేపీ నాయకత్వం భావించదట. ఎలాగో అక్కడ మనం రాజకీయంగా బలపడ్డాం. పలు ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్నాం. అక్కడి ప్రజల నుంచి మనకు మంచి స్పందన వస్తుంది. దీనిని ఆసరాగా చేసుకొని భారీగా సభ్యత్వ నమోదు చేపట్టాలని ఢిల్లీ నేతలు అనుకున్నారట. ఐతే  కేంద్ర బీజేపీ నాయకులు అనుకున్నదొక్కటి అయితే ఇక్కడ జరుగుతుంది మరొకటి. ఇక్కడ కీలక నేతలు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చాలా లైట్ గా తీసుకుంటన్నారట. మరీ ముఖ్యంగా కొన్ని కీలక స్థానాల్లో కనీస సభ్యత్వ నమోదు జరగకపోవడంపై హైకమాండ్ తీవ్ర ఆగ్రహంగా ఉంది. 

బీజేపీ సభ్యత్వ నమోదుకు సంబంధించిన సమాచారాన్ని ఇటీవల ఢిల్లీ పెద్దలు తెప్పించుకున్నారట.దానిని చూసిన ఢిల్లీ పెద్దలు షాక్ అయ్యారని సమాచారం. సభ్యత్వ నమోదు ఇంత తక్కువగా జరగడంపై బీజేపీ పెద్దలు చాలా ఆగ్రహంగా వ్యక్తం చేశారని నేతలు చెబతున్నారు. రాష్ట్రంలో కీలక నేతలుగా చెప్పుకుంటున్న వారి ఏరియాల్లో కూడా కనీస స్థాయిలో సభ్యత్వ నమోదు జరగకపోవడంపై అధిష్టానం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిందని వార్తలు తెలంగాణ బీజేపీ ఆఫీసులో చక్కర్లు కొడుతున్నాయి. రాష్ట్ర స్థాయి నేతలుగా ముద్ర ఉన్న నేతలు కూడా ఇలా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎందుకు పట్టించుకోలేదని బీజేపీ నేతలు ఆరా తీసారట. బీజేపీ పెద్దలకు ఇక్కడ ఒక ఆసక్తికర అంశం తేలిందంట. పార్టీలో వలస వచ్చిన నేతల స్థానాల్లో సభ్యత్వ నమోదు చాలా తక్కువగా జరిగిందంట. మిగితా చోట్ల మాత్రం ఆశించిన స్థాయిలో సభ్యత్వ నమోదు జరుగుతుందని పార్టీ పెద్దలకు ఫీడ్ బ్యాక్ వచ్చింది. 

అయితే ఇప్పుడు ఇదే విషయంలో రాష్ట్ర బీజేపీలో తీవ్ర చర్చ జరుగుతుంది. ఢిల్లీ బీజేపీ నేతలు తెలంగాణ బీజేపీలో కొందరి వలస నేతలపై అతిగా ఊహించుకుందని వారికి ఇప్పుడు అసలు విషయం బోధపడుతుందని అసలైన బీజేపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. పార్టీ సిద్దాంతం ప్రకారం మొదటి నుంచి తాము పనిచేస్తుంటే అధిష్టానం మమ్మల్ని కాదని కొందరిని ఏరి కోరి పక్క పార్టీల నుంచి చేర్చుకుందని వారు తెగ బాధపడుతున్నారు. కనీసం వారు వస్తే వచ్చారు కానీ పార్టీ కోసం కాకుండా తమ స్వంత ఎజెండా ప్రకారం పనిచేయడం పట్ల ఆ నేతలు అసంతృప్తితో ఉన్నారు. హైకమాండ్ వలస నేతలపై పెట్టుకున్న ఆశలను వారి అడియాశలు చేసారని, పార్టీలో చేరిన నాటి నుంచి వారు తమ వ్యక్తి గత పొలిటికల్ ఇమేజ్ కోసం పోరాడుతున్నారు తప్పా పార్టీ కోసం పనిచేయడం లేదని చెప్పుకుంటున్నారు.సొంత రాజకీయ లాభం కోసం పార్టీలో చేరే వారి పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలని అసలైన బీజేపీ నేతలు హైకమాండ్ కు చెబుతున్నారట. ఇలాంటి నేతలను నమ్ముకుంటే కష్టమని పార్టీ కోసం పని చేసే వారిని గుర్తించి వారి సేవలను వాడుకోవాలని అసలైన బీజేపీ నేతలు  అంటున్నారు.

అంతే కాదు వలస వచ్చిన నేతల డిమాండ్లు కూడా ఆశామాషీగా ఉండడం లేదట. పార్టీలో పట్టుకోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట. దీంతో పాటు పదవులు కావాలని పేచీ కూడా పెడుతున్నారట. నేను చాలా సీనియర్ ను నాకు  ప్రజల్లో పెద్ద ఎత్తున ఆదరణ ఉంది నాకు ఆ పదవి రావడం సముచితం అని వలస నేతలు చెప్పుకుంటున్నారుట.దీనికి సంబంధించి అధిష్టానం దగ్గర కూడా లాబీయింగ్ చేస్తున్నారట. అసలు తెలంగాణలో బీజేపీ బలపడడానికి మేమే కారణం అని వాళ్లు తెగ ప్రచారం చేసుకుంటున్నారట. మరి మీరు అంత ప్రజాధరణ కలిగిన నేతలు అయితే మీ ప్రాంతాల్లో సభ్యత్వ నమోదు ఎందుకు తక్కువగా జరుగుతుందని వలస నేతలను అసలైన బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారట. దీంతో   ఇదే విషయంలో వలస నేతలకు. అసలైన బీజేపీ నేతల మధ్య గ్యాప్ కూడా ఏర్పడిందంట.

మొత్తంగా బీజేపీ పెద్దలు అనుకుంది ఒకటి తెలంగాణలో జరుగుతుంది మరొకటి. వలస నేతలతో పార్టీ బలోపేతం అవుతుంది అనుకుంటే పార్టీ పక్కన పెట్టి వారు సొంతంగా బలపడటానికి ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ హై కమాండ్ ఏం చేయబోతుంది..తెలంగాణ బీజేపీనీ ఎలా గాడిన పెడుతుందో వేచి చూడాలి.

ఇదీ చదవండి: రేషన్‌, ఆరోగ్యం, పింఛను అన్నింటికీ ఒకటే డిజిటల్‌ కార్డు.. ఎలా పని చేస్తుందంటే?   

ఇదీ చదవండి:   సినీనటుడు రాజేంద్ర ప్రసాద్‌ ఇంట్లో తీవ్ర విషాదం.. గుండెపోటుతో కూతురు గాయత్రి మృతి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News