Ram Charan:రామ్ చరణ్..చిరంజీవి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తండ్రి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక 2022లో రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో రామ్ చరణ్ గ్లోబల్ లెవల్లో సత్తా చాటాడు. ఈ చిత్రంో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ పాత్రకు మంచి ప్రశంసలే లభించాయి. అంతేకాదు ఈ సినిమాలోని డాన్సులతో , ఫైట్స్ తో ఆడియన్స్ ను అలరించాడు. ఇక ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు మన దేశానికి తొలి ఆస్కార్ రావడంలో రామ్ చరణ్ పాత్ర మరవలేనిది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటనకు తెలుగు సహా భారతీయ ప్రేక్షకులే కాదు.. హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు.
రీసెంట్ గా హాలీవుడ్ యాక్టర్ లుకాస్ బ్రావో కూడా ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్‌చరణ్ యాక్టింగ్ ను మెచ్చుకున్నాడు. ఎమిలీ ఇన్ పారిస్‌కు సంబంధించిన ప్రమోషన్స్ సమయంలో భారతీయ సినిమాల్లో మీకు నచ్చిన నటుడు గురించి చెప్పమని అడిగినప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా చూశానని చెప్పిన లుకాస్ బ్రావో.. అందులో లీడ్ రోల్లో యాక్ట్ చేసిన రామ్ చరణ్ యాక్టింగ్ ను మెచ్చుకున్నాడు. అంతేకాదు అతనో అద్భుతమైన నటుడు అని చెప్పారు. ఈ సినిమాలో రామ్ చరణ్ చేసిన ఫైట్స్ మరియు ఎమోషనల్ ప్రెజెన్స్ ఉత్కంఠభరితంగా ఉంటుందని చెప్పటడం విశేషం.
భారతీయ సినీ ఇండస్ట్రీకి ఆస్కార్ అవార్డును తెచ్చిన సినిమా మన తెలుగు సినిమా.. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఈ ఘనతను దక్కించుకుంది. ఈ చిత్రంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించాడు. అటు తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 1300 కోట్లకు పైగానే వసూళ్లను సాధించింది. అయితే.. ఈ సినిమాలో అల్లూరి, కొమరం భీమ్ పాత్రలను వక్రీకరించడంపై కొంత మంది చరిత్ర కారులు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా.
ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..
ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter