Dil Raju IT Raids: వరుస సినిమాలు చేస్తూ.. అత్యంత విజయవంతమైన నిర్మాతగా పేరొందిన దిల్ రాజుపై ఐటీ సోదాలు వరుసగా నాలుగు రోజుల పాటు జరగడం తెలుగు రాష్ట్రాలతోపాటు సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ దాడుల సమయంలో దిల్ రాజు అంశంపై విస్తృతంగా వార్తలు వచ్చాయి. దిల్ రాజును అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. నాలుగు రోజుల తర్వాత ఐటీ దాడులు ముగియడంతో తొలిసారి దిల్ రాజు నోరు విప్పారు. తన నివాసం.. కార్యాలయాలపై జరిగిన ఐటీ దాడులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: IT Raids: ఐటీ దాడులపై విక్టరీ వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు.. 'నాదంతా వైట్'
'నాలుగురోజులుగా ఐటీదాడులు మా నివాసాల్లోనూ .. ఆఫీస్‌లోనూ జరిగాయి. కొన్ని ఛానెల్స్.. సోషల్ మీడియాలో మా వద్ద డబ్బులు, డాక్యుమెంట్స్ దొరికాయని వార్తలు వేశారు. కానీ రూ.20 లక్షల లోపు మాత్రమే ఉన్నాయి' అని దిల్ రాజు ప్రకటించారు. ఐదు సంవత్సరాల నుంచి తాము ఎక్కడా ఇన్వెస్ట్ చేయలేదని ప్రకటించారు. '24 క్రాఫ్ట్స్‌లో లావాదేవిల డిటైల్స్ తీసుకున్నారు. పైనల్‌గా నా వద్ద డాక్యుమెంట్స్ పరిశీలించారు. అంతా పక్కాగా ఉండడంతో ఐటీ అధికారులే ఆశ్చర్యపోయారు' అని వివరణ ఇచ్చారు.
Also Read: Pushpa 2 IT Raids: ఏయ్ కేశవా ఇంకెన్ని గండాలు? పుష్ప 2 సినిమాకు వదలని కష్టాలు
'మా అమ్మకు లంగ్ ఇన్ఫెక్షన్ వల్ల చికిత్స తీసుకున్నారు. దయచేసి మామీద తప్పుడు వార్తలు వేయవద్దు' అని దిల్ రాజు విజ్ఞప్తి చేశారు. 'నేనేమి టార్గెట్ అవ్వలేదు. మా మీద ఐటీ సోదాలు జరిగి 18 ఏళ్లు అయింది. ఇదంతా ఒక ప్రక్రియ. ఎక్కువగా ఊహించుకోవద్దు.. ఎలాంటి హడావుడి లేదు' అని దిల్ రాజు స్పష్టం చేశారు. 'సినీ పరిశ్రమలో అంతా ఆన్‌లైనలో బుకింగ్ .. ఆన్‌లైన్ లావాదేవీలు జరుగుతున్నాయి. ఇండస్ట్రీ అంతటా రైడ్స్ జరిగాయి' అని గుర్తుచేశారు.
సినిమా కలెక్షన్స్ లెక్కల విషయమై దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. 'కలెక్షన్స్ ఎక్కువ చేసి చూపించడం మీద ఇండస్ట్రీ అంతా కూర్చొని మాట్లాడతాం. అది తప్పు.. తీరు మార్చుకోవాల్సిందే' అని పేర్కొన్నారు. 'ఫిబ్రవరి 3వ తేదీన ఐటీ అధికారులు కలవమన్నారు.. ఆ రోజు ఆడిటర్స్ వెళ్లి కలుస్తారు' అని దిల్ రాజు చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook