Nawazuddin Siddiqui trolls RRR, KGF 2 at Cannes Film Festival 2022: భారతీయ సినీ పరిశ్రమ అంటే 'బాలీవుడ్' అనే మాట పోయింది. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు దేశవ్యాప్తంగా సత్తాచాటినా.. ప్రస్తుతం దక్షిణాది సినిమాల హవా నడుస్తోంది. సౌత్ సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. బాహుబలితో మొదలైన ఈ పరంపర పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలతో పీక్స్‌కి వెళ్లింది. ఇండియన్ సినిమాకు సౌత్ సినిమాలు కొత్త నిర్వచనం చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సౌత్ ఇండస్ట్రీ, బాలీవుడ్‌కి మధ్య చిచ్చు రాజుకుంది. సౌత్ సినిమాల విజయాలను జీర్ణించుకోలేని బాలీవుడ్ నటులు తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు.
75వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ఫ్రాన్స్ నగరంలోని కేన్స్ వేదికగా మంగవాళం హాట్టహాసంగా మొదలయ్యాయి. ఈ సారి ఫెస్టివల్‌లో ఇండియా నుంచి హాజరైన వారిలో ఆర్. మాధవన్, శేఖర్ కపూర్, ప్రసూన్ జోషి, ఏఆర్ రెహమాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ లాంటి ప్రముఖులు ఉన్నారు. వీరందరూ రెడ్ కార్పెట్ మీద నడిచి సందడి చేశారు. ఆపై మీడియా సమావేశంలో పాల్గొన్న నవాజుద్దీన్ పరోక్షంగా ది కాశ్మీర్ ఫైల్స్, ఆర్ఆర్ఆర్ మరియు కేజీఎఫ్ చాప్టర్ 2 వంటి బ్లాక్‌బస్టర్‌ల బాక్సాఫీస్ కలెక్షన్‌లపై పరోక్షంగా వ్యంగ్యాస్రాలు సందించారు. కేన్స్‌లో మంచి చిత్రాల గురించి మాత్రమే చర్చించుకుంటారని, బాక్సాఫీక్ కలెక్షన్స్ గురించి ఎవరూ మాట్లాడరన్నారు.
హిందుస్థాన్ టైమ్స్‌తో నవాజుద్దీన్ సిద్ధిఖీ మాట్లాడుతూ.. 'నేను సినీ కెరీర్ ప్రారంభించినప్పుడు ఒక రోజు కేన్స్‌కు వెళ్తానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఇదంతా సినిమా మహత్యం. మంచి సినిమా గురించి ప్రతి మూలా మాట్లాడుకుంటారు. అంతేకాని బాక్సాఫీస్ కలెక్షన్ గురించి ఎవరూ మాట్లాడరు. ప్రస్తుత రోజుల్లో బాక్సాఫీస్ కలెక్షన్ చూసే సినిమా చూస్తున్నారు. ఇది సరియైనదా?. ఇక్కడ మాత్రం అవేమి చర్చించబడదు' అని అన్నారు.
నవాజుద్దీన్ సిద్ధిఖీ గురువారం (మే 19) తన 48వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. కేన్స్‌లో తన పుట్టినరోజును జరుపుకోవడం గురించి మాట్లాడుతూ.. 'ప్రతి సంవత్సరం దాదాపుగా ఇదే సమయంలో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది. కాబట్టి నేను కేన్స్‌లో 5-6 పుట్టిన రోజులు జరుపుకున్నా. నేను పుట్టిన రోజులను పెద్ద పండగలా జరుపుకునే వ్యక్తిని కాదు. నాకు ఇది సాధారణ రోజులా ఉంటుంది' అని నవాజుద్దీన్ అన్నారు.
Also Read: Malaika Arora Wedding: త్వరలో బాలీవుడ్‌లో మరో జంట పెళ్లి.. స్టార్ హీరోయిన్ అండతో..!
Also Read: Kcr On Dalitha Bandhu: దళిత బంధుపై కేసీఆర్ సంచలన నిర్ణయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.