Nandamuri Balakrishna House in Jubilee Hills Encroached the Pavement Alleges Vijay Gopal : నందమూరి బాలకృష్ణ నివాసం గురించి ప్రముఖ యాంటీ కరప్షన్ యాక్టివిస్ట్ విజయ్ గోపాల్ పలు ఆరోపణలు గుప్పించారు. గతంలో బుక్ మై షో అలాగే పేటీఎం లాంటి పలు సంస్థలతో పోరాడి లీగల్గా తనకు దక్కాల్సిన రూపాయిని కూడా వదలకుండా దక్కించుకున్న విజయ్ గోపాల్ బాలకృష్ణ తన నివాసం కోసం కబ్జా చేసినట్టు ఆరోపణలు గుప్పించారు.
సోషల్ మీడియాలో ఆయన బాలకృష్ణ ఇంటికి సంబంధించిన ఒక వీడియో పోస్ట్ చేయడమే కాకుండా నందమూరి బాలకృష్ణ ఇంటి పేవ్ మెంట్ మొత్తాన్ని ఆక్రమించారని, జనరేటర్ పెట్టి చెట్లు పెంచి అది తన సొంత స్థలంలాగా నందమూరి బాలకృష్ణ వాడుతున్నారని విజయ్ గోపాల్ ఆరోపించారు. ఇక అక్కడితో ఆగని ఆయన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ వంటి వారిని ట్యాగ్ చేసి ఒకవేళ సాధారణ ప్రజలు కూడా సెలబ్రిటీలు అయితే వాళ్ళు ఏం చేసినా మీరు ఇలాగే సైలెంట్ గా ఉంటారా అంటూ ప్రశ్నించారు.
Yesterday I couldn't help but realise how this @NBK house has clearly encroached the pavement completely infront of his house, putting generator, greenery n all, while people walking on roads. Right after the house, the pavement is fine. Why ?! @GHMCOnline @ZC_Khairatabad (1/2) pic.twitter.com/0SxxSWec6c
— Vijay Gopal (@VijayGopal_) October 8, 2022
ఇక మేయర్ గద్వాల విజయలక్ష్మిని, హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ఏవి రంగనాథ్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ట్విట్టర్ అకౌంట్ ని ట్యాగ్ చేసి ఈ విషయంలో మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇక నందమూరి బాలకృష్ణ నివాసం దగ్గర గత కొన్నాళ్ల క్రితం ఒక యాక్సిడెంట్ జరగడం కూడా కలకలం రేపింది. ఒక మహేంద్ర ధార్ వాహనం రోడ్ నెంబర్ 45 లోని జూబ్లీహిల్స్ బాలకృష్ణ నివాసం వైపు దూసుకు వెళ్లడమే కాక ఇప్పుడు విజయ్ గోపాల్ ఏదైతే గవర్నమెంట్ స్థలాన్ని కబ్జా చేసి చుట్టూ కంచె వేశారని ఆరోపించారో అదే ఫెన్సింగ్ ని ఢీ కొట్టింది.
ఆ సమయంలో ఒక యువతి వాహనం నడుపుతున్నట్టు కూడా వెల్లడైంది. నిజానికి ఆమె కారు నడుపుతున్న సమయంలో అంబులెన్స్ వెళుతూ ఉండడంతో దానికి దారి ఇచ్చేందుకే యువతి తన వాహనాన్ని పక్కకి తీసే క్రమంలో అది రోడ్డు డివైడర్ ఎక్కడంతో అక్కడి నుంచి అది అదుపుతప్పి బాలకృష్ణ ఇంటి నివాసం వైపు దూసుకు వచ్చింది. అయితే అప్పట్లో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లు అయింది. మొత్తం మీద ఇప్పుడు మరోసారి బాలకృష్ణ ఇంటి వ్యవహారం తెరమీదకు వచ్చినట్లయింది.
Also Read: Godfather fake Collections: చిరు నోట ఫేక్ లెక్కలా.. రామ్ చరణ్ మాటలేమయ్యాయి.. ఇలా అయితే ఎలా?
Also Read: Shetty 's Films in Kannada: కన్నడ నాట 'శెట్టి'లదే హవా.. ఏకంగా ఏడాదిలో మూడు సూపర్ హిట్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook