Manyam Dheerudu: ‘మన్యం ధీరుడు’గా వెండితెరపై మరో అల్లూరి సీతారామరాజు.. రిలీజ్ డేట్ ప్రకటన..

Manyam Dheerudu: భారత దేశ దాస్య శృంఖాలను తెంచేందుకు ఆ సేతు హిమాచలం వరకు ఎందో వీరులు తమ ప్రాణాలకు ఒడ్డి పోరాడారు. అందులో తెలుగువాడైన మన్యం వీరుడు ‘అల్లూరి సీతారామరాజు’ బ్రిటిష్ వాళ్లపై పోరాడుతూ తన ప్రాణాలను భరత మాత ఒడిలో విడిచారు. తాజాగా ఈయన జీవిత చరిత్రపై తెలుగులో ‘మన్యం ధీరుడు’ పేరుతో ఓ సినిమా రాబోతుంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 13, 2024, 08:15 PM IST
Manyam Dheerudu: ‘మన్యం ధీరుడు’గా వెండితెరపై మరో అల్లూరి సీతారామరాజు.. రిలీజ్ డేట్ ప్రకటన..

Manyam Dheerudu: తెలుగు ప్రేక్షకులకు అల్లూరి సీతారామరాజు అంటూ సూపర్ స్టార్ కృష్ణనే గుర్తుకు వస్తారు. అల్లూరి అంటే కృష్ణ..సూపర్ స్టార్  కృష్ణ అంటే అల్లూరి సీతారామరాజుగా ఆడియన్స్ పై చెరగని ముద్ర వేసారు. రీసెంట్ గా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రను చూపించారు. ఆ సినిమాలో ఆ పాత్ర పేరును వాడుకున్నారు.ఈ సినిమాలో అల్లూరి పాత్రను పూర్తిగా వక్రీకరించి తెరకెక్కించారని చరిత్రకారులు రాజమౌళి పై మండిపడ్డారు. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా వెండితెరపై ‘మన్యం ధీరుడు’ టైటిల్ తో మరో సినిమా రాబోతుంది. ఆర్ వివి సత్యనారాయణ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. ఆ చిత్రాన్ని ఆర్ వి వి మూవీస్ పతాకంపై శ్రీమతి ఆర్ పార్వతీ దేవి సమర్పణలో నరేష్ డెక్కల డైరెక్ట్ చేశారు.  ఈ సినిమాను ఆర్ వి వి సత్యానారాయణ నిర్మించారు. ఈ సినిమాలో ఆర్ వి వి సత్యనారాయణ అద్భుతంగా ఒదిగిపోయారు. ఇప్పటికే విడుద చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పటికే నిర్మాణంతర కార్యకమ్రాలు పూర్తి చేసుకొని ఈ చిత్రం సెప్టెంబర్ 20వ తేదిన రిలీజ్ అవుతుంది. ఈ చిత్రాన్ని అల్లూరి సీతారామరాజు నడియాడిన అరుకు,పాడేరులలోని పలు ప్రదేశాల్లో ఈ సినిమాను పిక్చరైజ్ చేశారు. అటు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ ప్రదేశాలలో చిత్ర నిర్మాణం పూర్తి చేసుకుంది.

అల్లూరి సీతారామరాజు అసలు సిసలు చరిత్రను సిల్వర్ స్కీన్ పై ఆవిష్కరించబోతున్నారు. ఈ సినిమా కోసం నటుడు నిర్మాత ఆర్ వి వి సత్యనారాయణ గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, విల్లు విద్యలో స్పెషల్ ట్రెయిన్ అయ్యారు. మన్యం ధీరుడు చిత్రంలో యదార్ధ సన్నివేశాలు, యదార్ధ సంఘటనలు ప్రజలకి అందించాలనే సంకల్పంతో ఆర్ వి వి సత్యనారాయణ  ఈ చిత్రాన్ తెరకెక్కించారు.బ్రిటిష్ బానిస సంకెళ్ళు తెంచుకుని  బ్రిటీష్ తెల్ల దొరల పాలనకు చరమగీతం పాడే సన్నివేశాలు ఈ సినిమాలో  ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉండబోతున్నాయట. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ మన్యం ప్రాంతంలో ప్రత్యేక సెట్ వేసినట్టు ఈ చిత్రం కోసం భారీ ఖర్చుతో ఆర్ వి వి సత్యనారాయణ  ఒక ఊరినే నిర్మించి అక్కడ షూట్ చేసారు. అంతేకాదు ఎంతో సాహసోపేత మైనటువంటి సన్నివేశాలు ఈ సినిమా కోసం తెరకెక్కించారు.  అల్లూరి సీతారామరాజు సినిమాలో చూపించనటు వంటి పలు రియల్ సంఘటనలను ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేసారట. మన్యం ధీరుడు చిత్రానికి సంగీతం పవన్ కుమార్ అందించారు.  కెమెరా వినీత్ ఆర్య, ఫరూక్ , ఎడిటర్ గా శ్యాం కుమార్ వ్యవహరించారు.

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News