Jithender Reddy First Glimpse: తెలుగులో పేరు చివరన రెడ్డి టైటిల్స్ ఉంటే ఆ సినిమా హిట్ అనే సెంటిమెంట్ సినీ ఇండస్ట్రీలో ఉంది. ఈ కోవలో రెడ్డి టైటిల్‌తో వస్తోన్న మరో చిత్రం 'జితేందర్ రెడ్డి'. ముదుగంటి క్రియేషన్స్ పతాకంపై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మాతగా ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. విరించి వర్మ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాలో 'పేకమేడలు' సినిమాతో మారిన రాకేష్ వర్రె టైటిల్ రోల్ ప్లే చేసాడు. ఈయన గతంలో బాహుబలి, ఎవరికి చెప్పొద్దు వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పూర్తి రాజకీయ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కుతోంది. రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు మరియు రవి ప్రకాష్ ఇతర ముఖ్య పాత్రలో యాక్ట్ చేశారు. గతంలో ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ వేడుక చాలా ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా నిర్మాత ముదుగంటి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ..
చరిత్ర ఏదైనా దాని గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంటుంది. అలా తెలుసుకోవాల్సిన ఒక చరిత్ర జితేందర్ రెడ్డి జీవితం. ఈ సినిమాలో ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీస్ చేసిన విరించి గ జితేందర్ రెడ్డి గురించి రీసెర్చ్ చేసి ఈ సినిమాను డైరెక్ట్ చేయడం చాలా ఆనందించదగ్గ విషయం. అదేవిధంగా రాకేష్ ఈ సినిమాతో జితేందర్ రెడ్డిగా ఆ పాత్రలో జీవించారు. ఈ సినిమా తర్వాత జితేందర్ రెడ్డిగా పిలవడం గ్యారంటీ. ఎన్నో అవార్డులు తీసుకున్న డిఓపి జ్ఞాన శేఖర్ గారు ఈ సినిమాకు పనిచేయడం నిజంగా మా అదృష్టం. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి జితేందర్ రెడ్డి పాత్ర గుర్తుండిపోతుంది ఆయన చేసిన సేవలు గుర్తుండిపోతాయి. జితేందర్ రెడ్డి చరిత్ర ఒక షార్ట్ ఫిలిం గా తీద్దాం అనుకున్నాను. కానీ తను చేసిన పనులు ప్రజలందరికీ తెలియాలంటే సినిమా తీయాలని ఈ సినిమా నిర్మించాము. ముందు ముందు టీజర్, ట్రైలర్ అదే విధంగా సినిమాతో మీ ముందుకి జితేందర్ రెడ్డి జీవిత కథని చరిత్రగా తీసుకురాబోతున్నాం. చరిత్ర అంటే జరిగిన నిజాన్ని తెలుసుకోవడం అలాంటి ఒక నిజాన్ని జితేందర్ రెడ్డి జీవితాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళ చరిత్ర తెలుసుకోవడం ఎంత ముఖ్యమో జితేందర్ రెడ్డి గురించి తెలుసుకోవడం కూడా అలాంటిదే. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది.
యాక్టర్ రవి ప్రకాష్ గారు మాట్లాడుతూ ...
ఇందులో నా క్యారెక్టర్ ఒక పోలీస్ ఆఫీసర్. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాను. కానీ ఇది కచ్చితంగా గుర్తుండిపోయే సినిమా అవుతుంది. గ్లింప్స్ చూసిన తర్వాత సినిమా పైన మాకు నమ్మకం పెరిగింది. స్ట్రాంగ్ సోల్ ఉన్న సినిమా ఇది. విరించి వర్మ గతంలో చేసిన సినిమాలు నాకు చాలా ఇష్టం. ఈ క్యారెక్టర్ కి నన్ను సెలెక్ట్ చేసుకోవడం చాలా సంతోషకంగా ఉంది. ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించి మంచి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను.
హీరో రాకేష్ వర్రె మాట్లాడుతూ ..
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా లైఫ్‌ను మొదలుపెట్టి.. మిర్,చి బాహుబలి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గర అయ్యి ఎవరికీ చెప్పొద్దు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాను. ఎవరికీ చెప్పొద్దు సక్సెస్ కి కారణం ప్రేక్షకులు, మీడియానే. ఈ మీడియా సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో ఏది జరగదు. మీ మీడియా సపోర్ట్ ఉండాలని ఫస్ట్ ఈ గాథరింగ్ తో మొదటి అడుగు మొదలుపెట్టాము. ఈ సినిమా మేము అనుకున్నట్టుగా అవ్వడానికి కారణం నలుగురు మెయిన్ పర్సన్స్. ప్రొడ్యూసర్ ముదుగంటి రవీందర్ రెడ్డి, డైరెక్టర్ విరించి వర్మ, డిఓపి జ్ఞాన శేఖర్, ఉమా గారు మరియు వాణి గారు. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందనే అనుకుంటున్నాను.
దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ ..
నేను గతంలో చేసిన రెండు సినిమాలు లవ్ కమ్ కామెడీ సినిమాలు. హ్యూమరే కాదు మంచి హ్యూమన్ ఎమోషన్స్ మరియు డ్రామా కూడా నాకు చాలా ఇష్టం. కథ వినడానికి వెళ్ళినప్పుడు ఒక బుక్ ఇచ్చి చదువుకోమన్నారు. కథ చదివిన తర్వాత ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ నేనే డైరెక్ట్ చేయాలి అనుకున్నాను. అదేవిధంగా జితేందర్ రెడ్డి గురించి తెలుసుకోవడం కోసం ఆయన విలేజ్ కు వెళ్లి ఆయన స్నేహితులతో అక్కడున్న ప్రజలతో మాట్లాడి అయ్యి ఎన్నో విషయాలు తెలుసుకుని ఈ సినిమా చేసాను. కొంతకాలం గ్యాప్ తీసుకున్న ఒక మంచి కథతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాను. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించి మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
Also Read: AP Pensions: ఏపీ ప్రజలకు భారీ షాక్.. ఇకపై ఇంటింటికి పథకాలు రావు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook