Jabardasth Anchor Sowmya : కనిపించని హైపర్ ఆది.. పెరిగిపోతోన్న జబర్దస్త్ యాంకర్ సౌమ్య క్రేజ్

Hyper Aadi Away From Jabardasth హైపర్ ఆది తాజాగా జబర్దస్త్ షోలో కనిపించడం లేదు. గత కొన్ని రోజుల క్రితమే రీ ఎంట్రీ ఇచ్చిన ఆది.. ఇప్పుడు మళ్లీ కనిపించకుండా పోయాడు. గత రెండు మూడు వారాలుగా ఆది కనిపించడం లేదు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 9, 2022, 06:10 PM IST
  • బుల్లితెరపై జబర్దస్త్ సందడి
  • కనిపించకుండా పోయిన ఆది
  • జబర్దస్త్ యాంకర్ సౌమ్య క్రేజ్
Jabardasth Anchor Sowmya : కనిపించని హైపర్ ఆది.. పెరిగిపోతోన్న జబర్దస్త్ యాంకర్ సౌమ్య క్రేజ్

Hyper Aadi Anchor Sowmya బుల్లితెరపై హైపర్ ఆది వేసే పంచ్‌లు ప్రస్తుతం అందరూ మిస్ అవుతున్నారు. ఢీ, శ్రీదేవీ డ్రామా కంపెనీల్లో ఆది సందడి చేస్తున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం జబర్దస్త్ షోకు మళ్లీ గ్యాప్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఆ మధ్య మూడు నెలలు గ్యాప్ ఇచ్చిన ఆది.. జబర్దస్త్ షోలోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు మళ్లీ గ్యాప్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. సినిమాలు, బుల్లితెరపై షోలతో బిజీగా ఉండటంతోనే ఇలా జబర్దస్త్ షోకు డుమ్మా కొడుతోన్నట్టుగా కనిపిస్తోంది.

అందరి మీద పంచులు వేసే ఆది మీదే పంచులు వేసి బుల్లితెర నటి సౌమ్య అందరినీ ఆకట్టుకుంది. భలే మంచి రోజులు అనే ఈవెంట్‌లో ఆది మీద కౌంటర్లు వేసి సౌమ్య మెప్పించింది. అయితే ఆ టైంలో జబర్దస్త్ యాంకర్‌గా సౌమ్య వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అనసూయ బయటకు వెళ్లడంతో యాంకర్‌ల విషయంలో కొరత స్పష్టంగా కనిపించింది. జబర్దస్త్ యాంకర్‌గా ఎవరెవరి పేర్లో వినిపించాయి. కానీ చివరకు సౌమ్య ఎంట్రీ ఇచ్చింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News