Nagarjuna Fires on Geetu : నాగార్జున మొదటి సారిగా గీతూని తిట్టాడు. ఇన్ని వారాల్లో గీతూ ఏం చేసినా కూడా మెచ్చుకున్నాడు. ఆహా ఓహో అంటూ కీర్తించాడు. గీతూ ది బెస్ట్ అన్నట్టుగా సర్టిఫికేషన్ ఇచ్చాడు. కానీ ఆ గీతూ ఎంత తలతిక్కదో తెలుసుకోలేకపోయాడు. ఆమెకు బిగ్ బాస్ అన్నా కూడా.. నాగార్జున అన్నా కూడా లెక్కలేదని తెలిసిందే. ఆమెకు ఏ రూల్ ఇచ్చినా పాటించదు. తనకు తానే బిగ్ బాస్ అన్నట్టుగా భ్రమలో బతికేస్తుంటుంది.
ఆమె తన భుజం మీద ఈ బిగ్ బాస్ ఆరో సీజన్‌ను మోస్తున్నట్టుగా ఊహాలోకంలో ఉంటుంది. ఇక ఆమె చేసే అతిని జనాలు భరించడం లేదు. కానీ ఇంకా ఇంట్లోనే ఉంచుతున్నాడు బిగ్ బాస్. ఇలాంటి పిచ్చి, వింత కారెక్టర్ కూడా బిగ్ బాస్ ఇంటికి అవసరమే అని అనుకున్నాడో ఏమో గానీ గీతూ మాత్రం ఇప్పట్లో ఎలిమినేట్ అవ్వదు. చేయరు. అయితే ఈ వారం మాత్రం ది వరెస్ట్ గేమ్ ఆడేసింది గీతూ. తాను గెలవడం కోసం కాకుండా.. పక్కన వారి వీక్ నెస్ మీద కొట్టడంలోనే ఎక్కువగా దృష్టి పెట్టేసింది గీతూ.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook