Masthan Sai: మస్తాన్‌ సాయి కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. తెరపైకి హీరో నిఖిల్‌ ప్రైవేటు వీడియోలు?

Lavanya Alleged Masthan Sai Have Hero Nikhil Private Videos: సినీ పరిశ్రమకు మరో వివాదం రాజుకుంది. మస్తాన్‌ సాయి- లావణ్య వ్యవహారంలో హీరో నిఖిల్‌ ప్రైవేటు వీడియోలు ప్రస్తావనకు రావడం సంచలనం రేపుతోంది. నిఖిల్‌ ఫోన్‌ హ్యాక్‌తోపాటు ప్రైవేటు వీడియోలు తీసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 3, 2025, 07:15 PM IST
Masthan Sai: మస్తాన్‌ సాయి కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. తెరపైకి హీరో నిఖిల్‌ ప్రైవేటు వీడియోలు?

Private Videos Leaked: రాజ్‌ తరుణ్‌ మాజీ ప్రియురాలు లావణ్య మానేపల్లి వివాదం ఇంకా ముగియలేదు. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు తిరుగుతూ ఈ వివాదం ఎక్కడెక్కడికో తిరుగుతోంది. ఈ వివాదం మస్తాన్‌ సాయి చుట్టూ అల్లుకున్నది. తాజాగా ఈ వివాదంలో భారీ పరిణామం చోటుచేసుకుంది. మస్తాన్‌ సాయిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. లావణ్య ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌కు ముందు లావణ్య తన ఫిర్యాదులో సంచలన విషయాలు తెలిపారు. ఈ సందర్భంగా కీలకమైన ఆధారాలను సమర్పించారు. వాటిలో వందలాది మంది యువతులకు సంబంధించిన వీడియోలు ఉండడం సంచలనం రేపుతోంది. మస్తాన్‌ సాయి అమ్మాయిల నగ్న వీడియోల బ్యాంకునే కొనసాగిస్తున్నట్లు లావణ్య బహిర్గతం చేసింది. దీనికి సంబంధించిన వీడియోలను కూడా ఆమె లీక్‌ చేసింది.

Also Read: Raj Tarun: తెరపైకి మరోసారి లావణ్య రాజ్ తరుణ్ కేస్.. 200కు పైగా అశ్లీల వీడియోలు.. మస్తాన్ సాయి అరెస్ట్

మస్తాన్‌ సాయికి సంబంధించి నగ్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో ఆ వీడియోలు లీకయ్యాయి. ఏకంగా 300 మంది అమ్మాయిలను మస్తాన్‌ సాయి నగ్నంగా వీడియోలు తీశాడని లావణ్య ఆరోపిస్తోంది. ప్రేమ.. పెళ్లి పేరుతో అమ్మాయిలన లోబర్చుకుని వారితో వీడియోలు తీస్తున్నాడని మస్తాన్ సాయిపై లావణ్య తీవ్ర ఆరోపణలు చేసింది. బెడ్ రూముల్లో కెమెరాలు పెట్టి శృంగార దృశ్యాలు రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది.

Also Read: KP Chowdary: గోవాలో 'కబాలి' నిర్మాత ఆత్మహత్య.. సినీ పరిశ్రమలో విషాదం

అమ్మాయిలతో నగ్నంగా చేసిన వీడియోకాల్స్‌ను కూడా మస్తాన్‌ సాయి రికార్డ్ చేశాడు. అన్ని వీడియోలను అతడి హార్డ్ డిస్కులో భద్రం చేసుకున్నాడు. రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్యను అత్యాచారం చేసి ఆ వీడియోలు కూడా రికార్డ్ చేశారనే ఆరోపణలు రావడంతో ఈ కేసు సంచలనంగా మారుతోంది. తన వీడియోలు డిలీట్ చేయాలని అడిగిన తనను మస్తాన్‌ దాడికి పాల్పడినట్లు లావణ్య ఆరోపిస్తోంది. అమ్మాయిలలను డ్రగ్స్‌కు బానిసలను చేసి లోబర్చుకుంటున్నాడని వాపోయింది. 4 టీబీ హార్డ్ డిస్క్‌లో 300 మంది అమ్మాయిల జీవితాలు ఉన్నాయని తెలిపింది. ఆ వీడియోలను పోర్న్ వెబ్ సైట్‌లో పెడతానంటూ అమ్మాయిలతో బ్లాక్ మెయిలింగ్ కూడా చేస్తున్నట్లు వివరించింది.

ఈ భయంతోనే వీడియోకాల్స్ వ్యవహారాన్ని బాధిత అమ్మాయిలు ఇంతవరకూ బయటపెట్టలేదని లావణ్య చెబుతోంది. తన ప్రైవేటు వీడియోల కోసం మస్తాన్ సాయి దగ్గర హార్డ్ డిస్క్‌ను తీసుకెళ్లగా అందులో 300 మంది వీడియోలు కనిపించాయని లావణ్య తెలిపింది. ఇక అంతేకాకుండా మస్తాన్‌ హ్యాకింగ్‌ కూడా చేస్తున్నాడని.. వరలక్ష్మి టిఫిన్స్ యజమాని ప్రభాకర్ రెడ్డి, హీరో నిఖిల్ ఫోన్లను హ్యాక్ చేసినట్లు లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. హీరో నిఖిల్, ప్రభాకర్ రెడ్డి ప్రైవేట్ వీడియోలను సైతం హార్డ్ డిస్క్‌లో మస్తాన్ దాచాడని లావణ్య ఆరోపిస్తోంది. హార్డ్ డిస్క్ ఇవ్వకపోవడంతో లావణ్యను చంపే ప్రయత్నం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్‌లో లావణ్య మస్తాన్ సాయిపై ఫిర్యాదు చేయగా.. పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. తనతో పాటు వందలాది మంది అమ్మాయిల జీవితాలను కాపాడాలని లావణ్య పోలీసులను కోరింది. ఈ సందర్భంగా 300 మంది అమ్మాయిల వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్‌ను పోలీసులకు అప్పగించింది. ఈ సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుందో తెలియడం లేదు. ఈ వివాదంలో హీరో నిఖిల్‌ పేరు ప్రస్తావనకు రావడంతో సినీ పరిశ్రమలోనూ హాట్‌ టాపిక్‌గా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News