Sritej Family: రేవంత్‌ రెడ్డి దెబ్బకు దిగివచ్చిన పుష్ప 2 నిర్మాతలు.. రేవతి కుటుంబానికి రూ.50 లక్షలు

Mythri Movie Makers Donates 50 Lakhs Stampede Victim Ravathi Family: తొక్కిసలాట ఘటనలో రేవంత్‌ రెడ్డి దెబ్బకు పుష్ప 2 ది రూల్‌ నిర్మాతలు దిగివచ్చారు. మృతురాలు రేవతి కుటుంబానికి ఆ సినిమా నిర్మాతలు భారీగా ఆర్థిక సహాయం అందించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 23, 2024, 07:10 PM IST
Sritej Family: రేవంత్‌ రెడ్డి దెబ్బకు దిగివచ్చిన పుష్ప 2 నిర్మాతలు.. రేవతి కుటుంబానికి రూ.50 లక్షలు

Allu Arjun Row: సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట సంఘటన తెలుగు రాష్ట్రాలనే కాదు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రేవంత్‌ రెడ్డి సినిమా బృందంపై తీవ్ర విమర్శలు చేస్తుండడంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చిత్రబృందాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. పరిస్థితులు వ్యతిరేకంగా మారుతున్న సమయంలో దెబ్బకు పుష్ప 2 ది రూల్‌ సినిమా నిర్మాతలు దిగివచ్చారు. మృతురాలి కుటుంబాన్ని పరామర్శించడమే కాకుండా చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీతేజ్‌ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. అనంతరం రేవతి కుటుంబానికి పుష్ప 2 నిర్మాతలు రూ.50 లక్షల భారీ విరాళం ప్రకటించారు.

Also Read: Tollywood: తెలంగాణకు బై బై! సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌కు తరలివెళ్లనుందా?

హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగి రేవతి తీవ్రంగా గాయపడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె కుమారుడు సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కొన్ని వారాలుగా చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ ఆరోగ్యం కొంత మెరుగైందని తెలుస్తోంది. అయితే వీరి విషయమై రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. రేవంత్‌ రెడ్డి సినిమా బృందంపై.. ముఖ్యంగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. సినీ నటీనటులతోపాటు చిత్రబృందంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే పుష్ప 2 ది రూల్‌ నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతలు స్పందించారు.

Also Read: School Holidays: విద్యార్థులకు జాక్‌పాట్‌.. వరుసగా మూడు రోజుల సెలవులు

కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పుష్ప 2 నిర్మాత నవీన్ ఎర్నేని పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. శ్రీతేజ్‌ కోలుకుంటున్నాడని చెప్పారు. కాగా అంతకుముందు నటుడు అల్లు అర్జున్‌ రూ.25 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించారు. చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను నిర్మాతలు అల్లు అరవింద్‌, బన్నీ వాసు పరామర్శించిన విషయం తెలిసిందే. దర్శకుడు సుకుమార్‌ సతీమణి బబిత రూ.5 లక్షలు ఆ కుటుంబానికి సహాయం అందించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కుమారుడి ప్రతీక్‌ ఫౌండేషన్‌ కింద రేవతి కుటుంబానికి రూ.25 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు. మరికొందరు సినీ ప్రముఖులు కూడా రేవతి కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు రానున్నారని సమాచారం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News