Game Changer Collections day 1: సంక్రాంతి సందర్భంగా నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ డైరెక్షన్లో వచ్చిన చిత్రం డాకు మహారాజ్. జనవరి 12వ తేదీన విడుదలైన ఈ సినిమా. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. రాజకీయ వేత్తగా మారిన తర్వాత బాలకృష్ణ 109వ చిత్రంగా ఈ సినిమా విడుదలయ్యింది. అటు రాజకీయాలలో వరుస హ్యాట్రిక్ లు అందుకుంటూ దూసుకుపోతున్న బాలయ్య ఇప్పుడు వరుస సినిమాలతో కూడా వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నారు.
ఈ సినిమాలో బాబీ డియోల్ తో పాటు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి అలాగే ఒక కీలకమైన సన్నివేశంలో ఊర్వశీ రౌతేలా కూడా నటించారు. అంతేకాదు ఇందులో స్పెషల్ సాంగ్ లో అద్భుతంగా పెర్ఫామ్ చేసి అందరినీ మెప్పించారు ఊర్వశి. అలాగే రవికిషన్, సచిన్ ఖేడ్కర్ తదితరులు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు.
రాజ్యం లేని రాజుగా మారిన భయంకరమైన, ధైర్యం గల డాకు కథ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, రాత్రి 7:15 గంటల వరకు దాదాపు 15 కోట్ల రూపాయలను ఈ సినిమా వసూలు చేసింది. మార్నింగ్ షోలలో 59.89% ఆక్యూపెన్సీ, మధ్యాహ్నం 64.02% ఆక్యూపెన్సీ, అలాగే ఈవినింగ్ షో లలో 74.61% ఆక్యూపెన్సీ తో థియేటర్లో రన్ అయ్యాయి.
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన డాకు మహారాజ్ సినిమా తొలిరోజు అంచనాలు అందుకుంది. ముఖ్యంగా రామ్ చరణ్ , కియారా అద్వానీ నటించిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమా అంచనాలను తొలిరోజే బీట్ చేసింది. ఈ సినిమా గేమ్ ఛేంజర్ మొదటి రోజు 7:15 గంటల వరకు దాదాపు రూ.12.4 కోట్లు మాత్రమే సంపాదించింది.
దీన్ని బట్టి చూస్తే మొదటి రోజే డాకు మహారాజ్ బ్రేక్ చేసింది. ఏకంగా రూ. 450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. కానీ డాకు మహారాజ్ రూ. 100 కోట్లతోనే తెరకెక్కింది. ఏది ఏమైనా గేమ్ ఛేంజర్ కంటే డాకు మహారాజ్ ప్రేక్షకులను బాగా మెప్పిస్తుంది అని చెప్పవచ్చు.
Also Read: Kateri Halwa: సంక్రాంతి స్పెషల్.. అందరు తప్పకుండా తినే కాటేరీ హల్వా ఇలా ఈజీగా చేసుకొవచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.