AR Rehman: ఏఆర్ రెహమాన్ ప్రయోగం అవసరమా? అయోమయంలో సింగర్స్..

AR Rehman Experiment: సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఏఆర్ రెహమాన్. ఎంతో ప్రయోగాత్మకమైన పాటలను.. సృష్టించి తనకంటూ ఒక క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అతను మరొక ప్రయోగాన్ని చేయబోతున్నాడు. ఈ వినూత్నమైన ఐడియా విని ఎంతోమంది ఆశ్చర్యపోతున్నారు.. మరదేమిటో తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 6, 2024, 01:19 PM IST
AR Rehman: ఏఆర్ రెహమాన్ ప్రయోగం అవసరమా? అయోమయంలో సింగర్స్..

AR Rehman AI Experiment:

ఏఆర్ రెహమాన్.. జింగిల్స్  కంపోజిషన్ తో తన కెరీర్ ని మొదలుపెట్టి.. అంచలంచలుగా సంగీత ప్రపంచానికి కీర్తి కిరీటంగా మారాడు. 1992లో మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన రోజా చిత్రంతో ఏఆర్ రెహమాన్ కి విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఏఆర్ రెహమాన్ మరొకసారి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో అతను చేయబోయే ఈ ప్రయోగం సర్వత్రా చర్చనీయాంసంగా మారింది. ఈ ప్రయోగం పై కొందరు హర్షం వ్యక్తం చేస్తుంటే మరికొందరు ఆందోళన చెందుతున్నారు.

గతంలో తాను కంపోజ్ చేసిన పాటలు పాడిన కొందరు గాయకుల గొంతును ఎప్పుడూ ఏఐ టెక్నాలజీ ద్వారా పునః సృష్టించి లాల్ సలాం చిత్రం కోసం వాడబోతున్నాడు ఏఆర్ రెహమాన్. అతను ఉపయోగిస్తున్న సింగెర్స్ సాహుల్ హమీద్, బంబా బక్యా.. ప్రస్తుతం కాలం చేశారు. అయితే వాళ్ల గొంతును పున సృష్టించడం కోసం వారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి అనుమతి తీసుకోవడంతో పాటు తగిన పారితోషకం కూడా ముట్ట చెబుతున్నాడు. గతంలో ఈ ఇద్దరు సింగర్స్ ఎన్నో హిట్ ట్రాక్స్ ను రెహమాన్ కంపోజిషన్ లో పాడారు.

ఎక్స్పరిమెంట్ సక్సెస్ అయితే భవిష్యత్తులో ఇదే తరహాలో ఎస్పీ బాలసుబ్రమణ్యం గాత్రాన్ని కూడా ప్రజలకు తిరిగి ఏఐ ద్వారా వినిపించాలి.. అని రెహమాన్ తన మనసులో మాటను వెల్లడించాడు. అయితే ప్రస్తుతం అతను చెప్పిన ఈ విషయం మ్యూజిక్ లవర్స్ లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి.. గతించిన..స్వర్గస్తులైన సింగర్స్ వాయిస్ రీ క్రియేట్ చేయడం వల్ల వర్ధమాన గాయకుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతుంది. తక్కువ ఖర్చుతో పాటల పూర్తి అవుతాయి కాబట్టి.. భవిష్యత్తులో ఇలా టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి నిర్మాతలు ముగ్గు చూపొచ్చు.

రెహమాన్ చేస్తున్న ఈ ప్రయోగాన్ని ఇక్కడితో ఆపేసి.. కొత్త సింగర్ స్కూల్ అవకాశం ఇస్తే బాగుంటుంది అని కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఇలాగైనా లెజెండరీ గాయనీ గాయకుల గాత్రం తిరిగి విని అవకాశం వస్తుంది అని అంటున్నారు. మరి రెహమాన్ తీసుకున్న ఈ నిర్ణయం పాటల ప్రపంచం పై ఎటువంటి ప్రభావం చూపిస్తుందో కాలమే నిర్ణయిస్తుంది.

Also read: Tirumala Tirupati Devasthanam: ఈ నెల తిరుమల వెళ్లేవారికి బిగ్అలర్ట్.. టీటీడీ కీలక ప్రకటన..!

Also read: Budh Gochar 2024: మరో ౩ రోజుల్లో ఈ రాశికి బ్యాడ్ టైం స్టార్ట్.. ఇందులో మీ రాశి ఉందా? చెక్ చేయండి..

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News