Major Closing Collections: అడవి శేష్ మేజర్ మూవీ ఎన్ని కోట్లు లాభం సాధించిందో తెలుసా?

Major Closing Collections: అడవి శేష్ హీరోగా నటించిన మేజర్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది, కాబట్టి థియేటర్ల నుంచి దాదాపు తప్పుకున్నట్టే. ఈ క్రమంలో ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసింది అనేది పరిశీలిద్దాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 6, 2022, 12:46 PM IST
  • అడవి శేష్ హీరోగా మేజర్ మూవీ
  • మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్
  • క్లోజింగ్ కలెక్షన్స్ ఎంతంటే?
Major Closing Collections: అడవి శేష్ మేజర్ మూవీ ఎన్ని కోట్లు లాభం సాధించిందో తెలుసా?

Major The movie Closing Collections: అడవి శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కి విడుదలైన తాజా చిత్రం మేజర్. 26 /11 టెర్రరిస్ట్ ఎటాక్స్ లో ప్రాణాలు కోల్పోయిన కేరళ రాష్ట్రానికి చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాకు కథ కూడా అడవి శేష్ అందించగా సినిమాను మహేష్ బాబుతో కలిసి సోనీ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. తెలుగు సినీ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా సినిమా విడుదల కాక ముందే 9 సిటీస్ లో ముందే ప్రీమియర్లు వేసి ప్రేక్షకుల స్పందన తెలుసుకున్నారు. ఆ తర్వాత జూన్ మూడో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లు సాధించింది.  

నిజానికి ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 13 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. అలాగే ఓవర్సీస్ సహా మిగతా రాష్ట్రాలలో ఐదు కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంది అలా మొత్తం మీద 18 కోట్ల బిజినెస్ జరుపుకునే ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ 19 కోట్లుగా నమోదైంది. సుమారు నాలుగు వారాలకు కలిపి ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 17 కోట్ల 85 లక్షల షేర్ వసూళ్లు 29 కోట్ల 80 లక్షల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఏరియా వారీగా చూస్తే నైజాం 8 కోట్ల 26 లక్షలు, సీడెడ్ కోటి రూపాయల 95 లక్షలు, ఉత్తరాంధ్ర 2 కోట్ల 29 లక్షలు ఈస్ట్ గోదావరి కోటి రూపాయల 43 లక్షలు, వెస్ట్ గోదావరి 92 లక్షలు, గుంటూరు కోటి రూపాయల 18 లక్షలు, కృష్ణ కోటి రూపాయల 13 లక్షలు, నెల్లూరు 69 లక్షల రూపాయల వసూళ్లు సాధించింది. 

కర్ణాటక సహా మిగతా భారతదేశం మొత్తంలో 2 కోట్ల 15 లక్షల రూపాయలు సాధించింది. హిందీ సహా ఇతర భాషలలో ఏడు కోట్ల ఐదు లక్షల రూపాయలు వసూళ్లు సాధించింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 33 కోట్ల 35 లక్షల కోట్ల రూపాయల షేర్, 64 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. అంటే ఈ సినిమా 14 కోట్ల యాభై లక్షలు కేవలం థియేటర్ల ద్వారా లాభం ఆర్జించింది.  ఇక ఈ సినిమా ప్రస్తుతానికి తెలుగు, మలయాళ, హిందీ భాషలలో నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. జూలై మూడో తేదీ నుంచి ఈ సినిమా నెట్ ఫిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రేవతి, సాయి మంజ్రేకర్, శోభిత ధూళిపాళ్ల, అనీష్ కురివిళ్ల, మురళీ శర్మ వంటి వారు ఇతర కీలక పాత్రలలో కనిపించారు.

Also Read: Keeravani: రసూల్ ను దారుణమైన పదంతో ట్రోల్ చేసిన కీరవాణి.. ఎక్కడా తగ్గట్లేదుగా!

Also Read: Editor Gautham Raju: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News