Truck Hits Car in Unnao: ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అచల్‌గంజ్ ప్రాంతంలో వేగంగా వచ్చిన ట్రక్.. కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం రాత్రి 7 గంటల సయమంలో అచల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్నో-కాన్పూర్ జాతీయ రహదారిపై ఆజాద్ మార్గ్ కూడలి సమీపంలో వేగంగా వచ్చిన ట్రక్.. కారును ఢీకొట్టి ఈడ్చుకెళ్లి కాలువలో పడేసిందని ఎస్పీ సిద్ధార్థ్ శంకర్ మీనా తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు చెప్పారు.
వారిలో ఐదుగురిని ఛోటేలాల్ (32), శివంగ్ (30), విమలేష్ (60), రాంప్యారీ (45), శివాని (13)గా గుర్తించగా.. మృతుల్లో ఒకరిని ఇంకా గుర్తించాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారులో చిక్కుకున్న వారిని బయటకు తీశారని ఎస్పీ తెలిపారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని చెప్పారు.
ప్రమాదం తర్వాత స్థానికులు ఆగ్రహ వ్యక్తం చేస్తూ.. రహదారిని ఆందోళన చేపట్టారు. దీంతో లక్నో-కాన్పూర్ జాతీయ రహదారి కొన్ని కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డుపై బైఠాయించిన వారిని శాంతింపజేసేందుకు పోలీసులు ప్రయత్నించగా.. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. తర్వాత పోలీసులు వారిని మాట్లాడి.. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి చేసిన ట్వీట్‌లో, 'సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నావ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, మృతుల కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు..' రాసుకొచ్చారు. 'ముఖ్యమంత్రి క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించామని ఆదేశాలు జారీ చేశారు. వారికి మెరుగైన చికిత్స అందించి.. వారు త్వరగా కోలుకునేలా చూడాలని జిల్లా పరిపాలన అధికారులకు సూచించారు. దీంతో పాటు ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా మేజిస్ట్రేట్, పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు..' అని సీఎం కార్యాలయం మరో ట్వీట్ చేసింది.
Also Read: Bandi Sanjay: పసిపిల్లలు ఏడుస్తున్నా నీ మనసు కరగడం లేదా కేసీఆర్.. మానవత్వం లేని మృగానివి: బండి సంజయ్
Also Read: Air India Offers: ఫ్లైట్ టికెట్స్‌పై బంపర్ ఆఫర్.. ఎయిర్ ఇండియా రిపబ్లిక్ డే సేల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook