ఈ మధ్య కాలంలో పిల్లలు 7వ తరగతి.. 8వ తరగతి రాగానే మధ్యంకు అలవాటు అవుతున్నారు. వారు పెరిగే వాతావరణం... వారు చూసే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కారణంగా మధ్యం కు అలవాటు పడి స్నేహితులతో కలిసి పార్టీ ల్లో లేదా ఫంక్షన్స్ లో తాగడం మనం చూస్తూనే ఉన్నాం. చిన్న పిల్లలు బయట తాగడం పోయి ఇప్పుడు ఏకంగా స్కూల్ లో మధ్యం తాగే రోజులు వచ్చాయి.
ములుగు మండలం మల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన 9 మంది పిల్లలు స్కూల్ లో మధ్యం తాగినట్లుగా విచారణ లో వెళ్లడి అయింది. వారు మధ్యం తాగడం మాత్రమే కాకుండా స్కూల్ కు చెందిన ఉపాధ్యాయుడు మధ్యం తాగినట్లుగా నమ్మించేందుకు ప్రయత్నించారు. స్కూల్ లో ఉపాధ్యాయుడు మధ్యం తాగినట్లుగా చెప్పి ఇరికించేందుకు ప్లాన్ చేశారు. కానీ అది సాధ్యం కాలేదు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మల్లంపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన 9వ తరగతికి చెందిన 7 మంది పిల్లలు ఇంటర్మీడియట్ కు చెందిన ఇద్దరు శనివారం బయటకు వెళ్లి మధ్యం కొనుగోలు చేసి హాస్టల్ లోకి తీసుకు వచ్చారు. రాత్రి సమయంలో ఆ 9 మంది మధ్యం తాగుతూ ఉండటం ను గుర్తించిన డ్యూటీ టీచర్ వారిని మందలించాడు. ఇకపై ఎప్పుడు కూడా మధ్యం తాగమని వారితో రాయించుకుని సైన్ చేయించుకున్నాడు.
ఆ మరుసటి రోజు చెప్పకుండా మొత్తం 9 మంది కూడా వారి వారి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో ఉపాధ్యాయుడు మందుతాగి తాము తాగినట్లుగా రాసి సంతకం చేయించుకున్నాడు అంటూ చెప్పారు. దాంతో తల్లిదండ్రులు స్కూల్ పై దాడికి అంతా కలిసి వచ్చారు. విషయం తెలిసిన స్థానిక ఎమ్మార్వో మరియు సాంఘిక సంక్షేమ శాఖ రీజినల్ కో ఆర్డినేటర్ విచారణ చేపట్టారు.
Also Read: Kushi: 'ఖుషి' నుంచి మరో మెలొడీ వచ్చేసింది.. ఆకట్టుకుంటున్న 'ఆరాధ్య' పాట..
విచారణ లో విద్యార్థులు వెళ్లి మధ్యం కొనుగోలు చేసింది మొదలుకుని తాగినంత వరకు క్లీయర్ గా తేలిపోయింది. విద్యార్థులు మధ్యం తాగి ఉపాధ్యాయుడిని ఇరికించే ప్రయత్నం చేయడంతో వారి తల్లిదండ్రులు కూడా షాక్ అయ్యారు. తమ పిల్లలను తిరిగి ఇంటికి తీసుకు వెళ్లారు. సోమవారం నుండి ఇప్పటి వరకు పిల్లలు తిరిగి స్కూల్ కు రాలేదు అని.. వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
వారికి టీసీ ఇవ్వాలని కూడా అనుకోవడం లేదని.. ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు తాను చర్యలు తీసుకుంటాను అన్నట్టు ప్రిన్సిపల్ పేర్కొన్నారు. మరో వైపు ఆబ్కారీ శాఖ అధికారులు మైనర్ విద్యార్థులకు మధ్యం అమ్మినందుకు గాను శ్రీరామ వైన్స్ పై కేసు నమోదు చేయడంతో పాటు లైసెన్స్ రద్దు చేసేందుకు సిద్ధం అవుతున్నట్లుగా పేర్కొన్నారు. మొత్తానికి ఈ వ్యవహారం స్థానికంగా సంచలనంగా మారింది.
Also Read: IND vs WI: అశ్విన్, జడేజా దెబ్బకి విండీస్ విలవిల.. తొలిరోజు భారత్‌దే ఆధిపత్యం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook