MBA Girl Suicide Case: మంత్రి సీతక్క ఇలాకాలో దారుణం.. ఎంబీఏ యువతి సూసైడ్ వెనుక కాంగ్రెస్ నేత కొడుకు..

MBA Girl Suicide Update: దిల్‌సుఖ్‌నగర్‌ లోని ఉమెన్స్‌ హస్టల్ లో నిన్న సాహితి అనే విద్యార్థిని సూసైడ్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా, ఈ ఘటన వెనుక ఉన్న సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థిని కాంగ్రెస్ కీలకనేత కొడుకు ఉన్నట్లు సమాచారం. 

Written by - Inamdar Paresh | Last Updated : Mar 15, 2024, 05:50 PM IST
  • సంచలనంగా మారిన ఎంబీఏ విద్యార్థిని సూసైడ్ కేసు..
  • ఘటన వెనుక కాంగ్రెస్ నేత కుమారుడి హస్తం..?
MBA Girl Suicide Case: మంత్రి సీతక్క ఇలాకాలో దారుణం.. ఎంబీఏ యువతి సూసైడ్ వెనుక కాంగ్రెస్ నేత కొడుకు..

DilsukhNagar MBA Student Suicide Incident: హైదారాబ్ లోని దిల్‌సుఖ్‌నగర్‌ లో ఉమెన్స్ హస్టల్ లో సాహితి అనే విద్యార్థిని నిన్న తన రూమ్ లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్రవిషాదంగా మారింది. అయితే.. దీనిలో తాజాగా, అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలి మేన మామ తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాపురం మండలానికి చెందిన కాంగ్రెస్ నేత చిడెం మోహన్ రావు కుమారుడు హరీష్. కొన్నిరోజులుగా తమ సాహితికి ఫోన్ కాల్ చేస్తూ, వాట్సాప్ లో మెసెజ్ లు పంపుతు వేదించేవాడని వాపోయాడు.

Read More: Election Commission 2024: రేపే ఎన్నికల నగారా.. ఏపీ సహా 4 రాష్టాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటన..

ఎన్నిసార్లు చెప్పిన కూడా తన బుద్ధిని మార్చుకోలేదు. బ్లాక్ చేసిన కూడ కొత్త కొత్త నంబర్లతో కాల్ లు చేస్తూ, వాట్సాప్ లు చేస్తు వేధించేవాడు. అయితే.. ఇదే విషయాన్ని హరీష్ తండ్రి మోహన్ రావుకు సాహితి చెప్పగా.. కుమారుడిని మందలించాల్సింది పోయి తిరిగి తమనే బూతులు తిట్టినట్టు సాహితి తన మేన మమతో చెప్పింది.

ఈ క్రమంలోనే తీవ్ర మనస్థాపం చెందిన సాహితి నిన్న హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తొంది. అయితే.. దీనిపై పోలీసులు కూడా తగిన చర్యలు తీసుకోవట్లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.  కాంగ్రెస్ నాయకుడు కావడంతో పోలీసులు చర్యలు తీసుకోవట్లేదని సాహితి కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

Read More: Unhealthy Food Habits: ఆఫీసులో అదేపనిగా చిరుతిండ్లు తింటున్నారా..?.. మీరు ఈ డెంజర్ లో పడ్డట్లే..

ఒక మహిళా మంత్రి సీతక్క ఇలాఖాలో ఇలాంటి ఘటన జరగటం తీవ్ర వివాదాస్పదంగా మారింది. దీనిపై పలువురు బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. తమ కుతురుకు న్యాయం చేయాలంటూకూడా బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

Trending News