Hyderabad Prostitution Racket: హైదరాబాద్‌లో సంచలన కేసు.. ఇంటర్నేషనల్ వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ఏకంగా 1419 మంది అమ్మాయిలతో..

Cyberabad Police Busts Human Trafficking Gang: హైదరాబాద్‌ నగరంలో భారీ వ్యభిచార ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 17 మంది నిందితులను అరెస్ట్ చేసి.. 1419 మంది బాధిత అమ్మాయిలను రక్షించారు. ఈ కేసుకు సంబంధించి సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరాలు వెల్లడించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 6, 2022, 04:45 PM IST
  • హైదరాబాద్‌లో అంతర్జాతీయ వ్యభిచార ముఠా
  • 15 సిటీల నుంచి అమ్మాయిలను రప్పించి దందా
  • 17 మందిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు
Hyderabad Prostitution Racket: హైదరాబాద్‌లో సంచలన కేసు.. ఇంటర్నేషనల్ వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ఏకంగా 1419 మంది అమ్మాయిలతో..

Cyberabad Police Busts Human Trafficking Gang: హైదరాబాద్‌ నగరంలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయ వ్యభిచార ముఠాలోని 17 మందిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 1419 మంది బాధిత అమ్మాయిలను గుర్తించి వారికి విముక్తి కల్పించారు. వెబ్ సైట్, వాట్సాప్ గ్రూప్స్, కాల్ సెంటర్లు, యాడ్స్ ద్వారా కస్టమర్లను ఆకర్షించి అమ్మాయిలను సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 

సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ భారీ సెక్స్ రాకెట్‌ను ఛేదించామని తెలిపారు. 15 సిటీల నుంచి వారిని రప్పించి సెక్స్ రాకెట్స్ నడుపుతున్నారని.. ఈ ముఠాకు చెందిన 17 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వీరికి 39 కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు తేలిందన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలతో పాటు విదేశీ మహిళలతో సెక్స్ రాకెట్స్ నడుపుతున్నారని.. 1419 మంది అమ్మాయిలు ఉన్నట్లు గుర్తించామన్నారు.

వ్యభిచారంతో పాటు డ్రగ్స్ కూడా సప్లై చేస్తూ కస్టమర్లకు ఎరా వేస్తున్నారనే విషయంపై మొత్తం ఐదు కేసులు నమోదు చేసి విచారిస్తున్నామని తెలిపారు సీపీ స్టీఫెన్ రవీంద్ర. సప్లయర్స్, బ్రోకర్లు ద్వారా బాధితులను కస్టమర్లు దగ్గరకు పంపుతున్నారని.. విమానాల్లో కూడా అమ్మాయిలను వేరే రాష్ట్రాలకి కస్టమర్ల వద్దకు దగ్గరకు పంపుతున్నారని చెప్పారు. బాధితులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, ముంబై, కోల్‌కత్తాకి చెందిన వారుగా గుర్తించామని.. బంగ్లాదేశ్, నేపాల్, యూజీకిస్తాన్, రష్యాకి చెందిన అమ్మాయిలతో కూడా ఈ దందా నిర్వహిస్తున్నాని వెల్లడించారు.  

'వ్యభిచారం ద్వారా వచ్చిన అమౌంట్‌లో 30 శాతం అమ్మాయిలకు, 35 శాతం యాడ్స్, వెట్‌సైట్‌కి, 35 శాతం ఆర్గనైజర్లకి వెళుతుంది. హ్యూమన్ ట్రాఫికింగ్‌లో ఆర్నావ్ అనే వ్యక్తి కీలక నిందితుడు. 915 మంది అమ్మాయిలని ముంబై, కోల్ కత్తా నుంచి సప్లై చేశాడు. 2019 నుంచి సమీర్ అనే వ్యక్తి 850 మంది అమ్మాయిలను సప్లై చేస్తున్నారు. అనంతపూరం, కరీంనగర్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో సెక్స్ రాకెట్ నడుపుతున్నారు. సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్‌లో ఆర్నావ్ అనే వ్యక్తి ఈ డ్రగ్స్, వ్యభిచార దందా చేస్తున్నాడు. 

సోమజిగూడాలో ఆర్నావ్‌ను ఓ ఫ్లాట్‌లో పట్టుకున్నాం. అదే ఇంట్లోనే ఎండీఎంఏ డ్రగ్స్‌ను సీజ్ చేశాం. ఈ సెక్స్ రాకెట్ వివిధ గ్రూపులుగా విడిపోయి ఈ దందా చేస్తున్నారు. కొన్ని హోటల్స్‌లో  పని చేసే వాళ్ల ప్రమేయం కూడా ఉంది. వారిని కూడా అరెస్ట్ చేశాం. వెబ్‌సైట్‌లో బుక్ చేసుకున్న వారికి అమ్మాయిలని సప్లై చేస్తున్నారు. జాబ్ లేని అమ్మాయిలను, పేదరికంలో ఉన్న అమ్మాయిలను జాబ్స్ పేరుతో వ్యభిచారం చేయిస్తున్నారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేశాం. చాలా మంది అమ్మాయిలని ట్రాప్ చేస్తున్నారు. మరి కొంతమందిని అయితే లగ్జరీ లైఫ్ చూపించి అమ్మాయిలను ఈ వ్యభిచారంలోకి దింపుతున్నారు. ఒక్కొక్కరు రూ.40 లక్షలు సంపాదించినట్లు తెలిసింది..' అని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. 

Also Read: Lalu Prasad Yadav: తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు కిడ్నీ దానం చేసిన కూతురు.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం  

Also Read: Pension Rules: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. పెన్షన్ నిబంధనల్లో కీలక మార్పులు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter,  Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News