Fraud couple: 'మోదీ గారి తాలూకా..' కోట్లు నొక్కేసిన ఈ జంట గురించి తెలుసుకుంటే మైండ్ బ్లాక్

Fraud couple: ఫలానా నాయకుడు మా చుట్టమే..ఫలానా నాయకుడు నాకు బాగా తెలుసు..అంటూ చెప్పుకుంటూ అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న కేటుగాళ్ల గురించి మనం చాలానే విన్నాం. కానీ ఓ కిలాడీజంట మాత్రం అంతకంటే హై ప్రోఫైల్ మోసాలకే పాల్పడింది. ఏకంగా మేము మోదీగారి తాలుకా అంటూ కోట్లు నొక్కేసింది. ఈ జంట గురించి అసలు విషయం తెలిస్తే మీరు షాక్ అవుతారు. 

Written by - Bhoomi | Last Updated : Dec 31, 2024, 01:50 PM IST
Fraud couple: 'మోదీ గారి తాలూకా..' కోట్లు నొక్కేసిన ఈ జంట గురించి తెలుసుకుంటే మైండ్ బ్లాక్

Fraud couple: స్టార్ హీరోలు..ప్రముఖ రాజకీయ నాయకులు మాకు తెలుసనని వారిని కల్పిస్తామంటూ అనేక మంది అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం ఇదివరకు ఎన్నో చూశాము. తాజాగా అలాంటి జంట గుట్టు రట్టయ్యింది. ఏకంగా ప్రధాని మోదీ కార్యదర్శి కుటుంబ సభ్యులుగా నటిస్తూ అనేక మంది అమాయకులకు మాటలు చెప్పారు. అవి నిజమేనని నమ్మి వాళ్ల దగ్గరి నుంచి టెండర్లు ఇప్పిస్తామంటూ కోట్లు లాక్కున్నారు. ఇలా ఒకరిద్దరు నుంచి కాదు అనేక మంది దగ్గర నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశారు. చివరకు పోలీసులకు చిక్కి ఊచలు లెక్కపెడుతున్నారు. వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

భువనేశ్వర్ కు చెందిన 38ఏళ్ల హన్సితా అభిలిప్సా, అనిల్ మొహంతిలు భార్యాభర్తలు. వీరిద్దరూ భువనేశ్వర్ లోని ఇన్ఫోసిటి ప్రాంతంలో ఓ విలాసవంతమైన భవనం అద్దెకు తీసుకున్నారు. అందులో ఓ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అభిలిస్పా తాను ప్రధాన మంత్రి మోదీ ప్రధాన కార్యదర్శి పికే మిశ్రా కూతురుని అని అందరికీ చెప్పింది. ఆ విషయాలను అందరూ నమ్మేలా చేశారు. అనేక మంది రాజకీయ ప్రముఖులతో కలిసి దిగిన ఫొటోలను కార్యాలయంలో పెట్టుకుంది. అంతేకాదు వచ్చిన వారందరికీ ఆ ఫొటోలను చూపించేది. అలాగే తన భర్త కూడా మిశ్రా అల్లుడిని అంటూ అందరికీ మాయమాటలు చెప్పేవారు. 

Also Read: Nimisha Priya: యెమెన్‌లో భారతీయ నర్సుకు మరణశిక్ష..భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏం చెప్పిందంటే?  

అయితే ఈ జంట మాటలు నమ్మి వారు కార్యాలయానికి వస్తే టెండర్లు ఇప్పిస్తామంటూ మీకెలాంటి పనులు కావాలన్నా చేసి పెడతామంటూ చెప్పేవారు. అయితే అందుకు డబ్బులు ఖర్చు అవుతాయని కోట్లు లాగేవారు. ముఖ్యంగా అభిలిస్సా మైనింగ్ నిర్మాణం, బహుళజాతి వ్యాపారాలు చేసే ధనవంతులను లక్ష్యంగా చేసుకుని వారితో పరిచయాలు పెంచుకునేది. అంతేకాదు ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలను తాను మార్చగలనని..తన మాటే అందరూ వింటారని నమ్మబలికేది. ఇలా ఎంతో మందిని మోసం చేసి కోట్లు కొల్లగొట్టిన ఈ జంటపై డిసెంబర్ 26వ తేదీన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడం అసలు విషయం బయటకు వచ్చింది. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అభిలిప్సా, ఆమె భర్త అనిల్ మొహంతిలు పీకే మిశ్రా ఫ్యామిలీకి చెందని వారు కాదని గుర్తించారు. అమాయక ప్రజలను మోసం చేసేందుకు వారు అలా నటించారని పోలీసుల విచారణలో తేలింది. కోట్లు కొల్లగొట్టిన ఆ కిలాడీలను అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు . వీరి చేతిలో ఇంకేవరైనా మోసపోయి ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని డీసీపీ సర్వాజ్ దేబాటా ప్రజలకు చెప్పారు. 

Also Read: Also Read: Sankranti rangoli 2025: సంక్రాంతి ముగ్గులు ట్రై చేస్తున్నారా..గోమాత డిజైన్ ముగ్గులు.. ఇవిగో మీకోసం  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News