8Th Pay Commission Salary Hike Updates: త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందబోతోంది. 8వ వేతన సంఘం అమలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
8Th Pay Commission Salary Hike Updates: 7వ వేతన సంఘం ఏర్పాటైన దశాబ్దం తర్వాత 8వ వేతన పంఘనం ఏర్పాటు చేయాలని ఉద్యోగుల నుంచి డిమాండ్స్ వస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ వేతన సంఘానికి సంబంధించిన చర్చలను కూడా ఆర్థిక నిపుణులతో జరిపినట్లు తెలుస్తోంది. అయితే దీనిని ఈ 2025 కొత్త సంవత్సరం సందర్భంగా త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 8వ పే కమిషన్ 2025 సంవత్సరంలో అమల్లోకి వస్తే.. 2026 నుంచి పెరిగిన కొత్త జీతాలు పంపిణీ అయ్యే ఛాన్స్‌లు ఉన్నాయి.
2025లో ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఉద్యోగుల నుంచి ఉహించని స్థాయిలో డిమాండ్స్ వస్తున్నాయి. అయితే వీటిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైందని సమాచారం.
ఇప్పటికే ఈ 8వ వేతన సంఘానికి సంబంధించిన అంశాలను రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం సంబంధించిన మంత్రులు చర్చించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే వీటిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా స్పందించింది. ఈ వార్తలు నిరాధారమని.. దీనిపై ఆర్థిక శాఖ ఎలాంటి ప్రకట చేయాలేదని వెల్లడించింది.
వార్తలన్నీ నిరాధారమైనప్పటికీ గతంలో రాజ్యసభలో జరిగిన చర్చలు ఉద్యోగులకు సానుకులంగానే కనిపిస్తున్నాయి. దీని బట్టి చూస్తే ఈ సంవత్సరంలోనే ఎనిమిదో వేతన సంఘాన్ని ఏర్పాలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
రాజ్య సభలో జరిగిన కొన్ని చర్చలను ఆధారంగా చూస్తే త్వరలోనే ఈ 8వ వేతన సంఘాన్ని కూడా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ దీనిని ప్రకటిస్తే.. చాలా మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
అధికారిక సమాచారం ప్రకారం, త్వరలోనే ప్రకటించబోయే యూనియన్ బడ్జెట్ 2025- 2026లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ 8వ వేతన సంఘాన్ని కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పటికే ఉద్యోగ సంఘాలు దీనిపై కేంద్ర ప్రభుత్వానికి మెమోరాండం కూడా అందించినట్లు తెలుస్తోంది..
కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరంలో 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తే.. వచ్చే ఏడాది 2026లో ఉద్యోగుల వేతనాలతో పాటు పెన్షన్స్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వేతన సంఘం అమల్లోకి వస్తే దాదాపు 186 శాతం వరకు జీతాల పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ వేతన సంఘం అమల్లోకి వస్తే.. ఒక ఉద్యోగి సాధరణ బేసిక్ సాలరీ రూ.18,000 ఉంటే.. దాదాపు రూ.34,560 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా పెన్షన్ కూడా దాదాపు రూ.17,280 వరకు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
(నోట్: ఈ వార్త కేవలం ఇతర న్యూస్ వెబ్‌సైట్స్ నుంచి ఆప్డేట్గా మాత్రమే రాయబడింది. దీనిని జీ తెలుగు న్యూస్ దృవీకరించడం లేదు.)