Indian Memory Championship 2024 Event in Hyderabad: 15వ ఇండియన్ నేషనల్ మెమరీ ఛాంపియన్షిప్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఇందులో 3 దేశాలు, 13 రాష్ట్రాలు, 59 నగరాలకు చెందిన 74 పాఠశాలల నుంచి 180 విద్యార్థులు మంది పాల్గొన్నారు. అదేవిధంగా హైదర్‌నగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థులు, ASWA ఫౌండేషన్ నుంచి ఐదుగురు విద్యార్థులు హాజరయ్యారు. స్క్వాడ్రన్ లీడర్ జయసింహ నేతృత్వంలోని ఇండియన్ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్, వైరల్‌పే స్పాన్సర్లుగా వ్యవహరించాయి. ఈ సందర్భంగా వైరల్ పే చైర్మన్ పీఆర్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదివింది గుర్తుపెట్టుకోవడానికి ఈ మెమోరీ టెక్నిక్స్ ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులందరికీ ఈ టెక్నిక్స్‌ను చేరవేయాలనే ఉద్దేశంతో ఈ ఈవెంట్‌ను స్పాన్సర్ చేసేందుకు ముందుకు వచ్చామన్నారు.
Also Read: Elephants: తెలుగు రాష్ట్రాల్లో ఏనుగుల హల్చల్.. చిత్తూరు, ఆసిఫాబాద్‌లో మూకుమ్మడి దాడి
అనంతరం వైరల్ పే సహ వ్యవస్థాపకురాలు శ్రీవల్లి పేపకాయల మాట్లాడుతూ.. జ్ఞాపకశక్తి శిక్షణ ప్రాముఖ్యతను వివరిస్తూ.. జ్ఞాపకశక్తి అభ్యాసానికి పునాదని అన్నారు. ప్రతి జిల్లాలో 800 మెమరీ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని.. వీటి ద్వారా 10 వేల నుంచి 15 వేల మంది వ్యవస్థాపకులు, మిలియన్ల మంది ఫ్రీలాన్సర్లకు సాధికారత కల్పించడమే తమ లక్ష్యమన్నారు. నటుడు, జాతీయ శిక్షకుడు ప్రదీప్ మాట్లాడుతూ.. ఇక్కడ పాల్గొన్న విద్యార్థులకు జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడంలో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తుందన్నారు. ఆత్మవిశ్వాసం ఉంటే జీవితంలో ఉన్నతశిఖరాలను చేరుకోవచ్చున్నారు.
జేఎన్టీయూహెచ్ బయోటెక్నాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఏ.ఉమా మాట్లాడుతూ.. ఈ మెమరీ ఛాంపియన్‌షిప్‌లో అన్ని వయసుల వారు ఉత్సాహంగా పోటీపడడం సంతోషంగా ఉందన్నారు. తాను ఓ టీచర్‌గా ఈ టెక్నిక్‌లకు సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పారు. రిటైర్డ్ డీఐజీ షేక్ సిరాజుద్దీన్ మాట్లాడుతూ.. జ్ఞాపకశక్తి అనేది దేవుడిచ్చిన వరం అని అన్నారు. పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ల సమయంలో అటవీ మార్గాలను ఎలా గుర్తు పెట్టుకున్నారో ఆయన వివరించారు. ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్నా.. జ్ఞాపకశక్తి నైపుణ్యాలు అమూల్యమైనవన్నారు.
రిటైర్ట్ ఐఏఎస్ డా.జయ ప్రకాష్ నారాయణ మాట్లాడుతూ.. ఇక్కడ పతకం అందుకున్నా.. లేకపోయినా పాల్గొన్న వారందరూ విజేతలేనని అన్నారు. స్పీడ్ రీడింగ్, మైండ్ మ్యాపింగ్‌లో భారత్ నుంచి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన రజనీష్ బారాపాత్రేకు ఆయన ట్రోఫీని అందజేశారు. స్క్వాడ్రన్ లీడర్ జయసింహ మాట్లాడుతూ.. ఇక నుంచి జయసింహ మైండ్ ఎడ్యుకేషన్, ఇండియన్ మెమోరీ స్పోర్ట్స్ కౌన్సిల్ బాధ్యతలను డాక్టర్ పి.శ్రీనివాస్ కుమార్‌కు అప్పగిస్తున్నట్లు తెలిపారు. తాను ఒక మెంటర్‌గా కొనసాగుతానని అన్నారు. శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ.. టర్కీలో జరిగే ప్రపంచ మెమరీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే అవకాశం చాలా మందికి కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter