SIP Superhit Scheme: ప్రస్తుతం పెట్టుబడి పెట్టేందుకు చాలా మార్గాలున్నాయి. అందులో బెస్ట్ ఆప్షన్‌గా అందరూ పరిగణించేది సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఎస్ఐపి. మ్యూచ్యువల్ ఫండ్స్‌లో ఎస్ఐపీ ద్వారా పెట్టే పెట్టుబడితో రిస్క్ తక్కువ. లాభాలు ఎక్కువగా ఉంటాయి.
షేర్ మార్కెట్‌లో నేరుగా పెట్టుబడి పెట్టే బదులు ఎస్ఐపీ ద్వారా మ్యూచ్యువల్ ఫండ్స్‌లో పెట్టుబడి అనేది మంచి మార్గంగా మార్కెట్ విశ్లేషకులు చెబుతుంటారు. ఎంత రిటర్న్స్ వస్తాయనేది కచ్చితంగా చెప్పలేకున్నా..దాదాపుగా 12 శాతం చొప్పున రిటర్న్స్ రావచ్చని అంచనా. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏ ఇతర స్కీమ్‌తో పోల్చినా ఇది చాలా ఎక్కువ. అంతేకాకుండా ఎస్ఐపీ డబ్బు వేగంగా పెరుగుతుంటుంది. సంపదను కూడబెట్టేందుకు లేదా సృష్టించేందుకు ఎస్ఐపీ మంచి మార్గం. ఇందులో ప్రత్యేకత ఏంటంటే మీరు చిన్న చిన్న మొత్తాల్లో అంటే 500 రూపాయలు చొప్పున కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. మీ స్తోమతను బట్టి పెంచుకోవడం లేదా తగ్గించడం చేయవచ్చు. చిన్న మొత్తాలతో ప్రారంభించి మీ ఆదాయానికి తగినట్టుగా క్రమంగా పెంచుకుంటూ వెళ్లి..దీర్ఘకాలం కొనసాగిస్తే మంచి రిటర్న్స్ లభిస్తాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అంటే నెలకు కేవలం 1000 రూపాయలు పెట్టుబడి పెడుతూ కూడా 35 లక్షల వరకూ కూడబెట్టవచ్చు.
నెలకు 1000 రూపాయలు ఎస్ఐపీలో పెట్టుబడి పెడితే ఏడాదికి 12 వేలు పెట్టుబడి అవుతుంది. అలా 30 ఏళ్లు కొనసాగిస్తే 30 ఏళ్లలో 3,60 వేల రూపాయలవుతుంది. సరాసరిన 12 శాతం రిటర్న్స్ చొప్పున లెక్కిస్తే అదనంగా 31 లక్షల 69 వేల 914 రూపాయలు లభిస్తాయి. అంటే మొత్తంగా చూస్తే 35 లక్షల రూపాయలు ఆర్జించవచ్చు. అంటే మీరు పెట్టిన పెట్టుబడికి పది రెట్ల కంటే ఎక్కువ ఆర్జించవచ్చు. ఇది సరాసరి 12 శాతం చొప్పున లెక్కిస్తే వచ్చిన మొత్తం. ఒక్కోసారి ఇంతకంటే ఎక్కువ కూడా పొందవచ్చు. మీ పెట్టుబడిని ఏడాదికి 5 శాతం పెంచుకుంటూ పోతే 30 ఏళ్ళకు 52 లక్షలకు పైగా ఆర్జించవచ్చు
Also read: FD Rate Hike: ఫిక్స్డ్ డిపాజిట్లపై పెరిగిన వడ్డీ రేట్లు, ఏ బ్యాంకు ఎంత ఇస్తుందో తెలుసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook