State Bank Of India: ఎస్‌బీఐ అకౌంట్‌ను మరో బ్రాంచ్‌కు ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి..? ఆన్‌లైన్‌లో సింపుల్‌గా మార్చుకోండి

SBI Online Account Transfer: స్టేట్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా అకౌంట్‌ను ఒక బ్రాంచ్‌ను మరో బ్రాంచ్‌కు సులభంగా మార్చుకోవచ్చు. మీకు నెట్‌బ్యాంకింగ్ ఉంటే ఆన్‌లైన్‌లో సింపుల్‌గా మార్చుకోవచ్చు. ఇందుకోసం మీరు హోమ్ బ్రాంచ్‌ను సందర్శించాల్సిన అవసరం లేదు. పూర్తి వివరాలు ఇలా..   

Written by - Ashok Krindinti | Last Updated : May 11, 2023, 05:37 PM IST
State Bank Of India: ఎస్‌బీఐ అకౌంట్‌ను మరో బ్రాంచ్‌కు ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి..? ఆన్‌లైన్‌లో సింపుల్‌గా మార్చుకోండి

SBI Online Account Transfer: ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్‌లో అకౌంట్‌లో గానీ.. ఇతర ఏవైనా సమస్యలు వస్తే.. ఆ బ్యాంక్‌కు సంబంధించిన ఏ బ్రాంచ్‌కు వెళ్లినా పరిష్కారం దొరుకుతుంది. కానీ ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలా కాదు. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే.. నేరుగా హోమ్ బ్రాంచ్‌కు వెళ్లాల్సిందే. కొంతమంది వేరే ప్రాంతాల్లో ఉంటూ అకౌంట్‌లో సమస్యలు వస్తే.. హోమ్‌ బ్రాంచ్‌కు వెళ్లేందుకు ఇబ్బందులు పడతారు. దీంతో అకౌంట్‌ను తాము నివసించే ప్రాంతానికి మార్చుకోవాలని అనుకుంటూ ఉంటారు. మీరు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి బదిలీ చేసుకోవాలనుకుంటే.. ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. వివరాలు ఇలా.. 

ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లోకి www.onlinesbi.com లోకి వెళ్లండి. ఇది ఎస్‌బీఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్ పోర్టల్. మీ యూజర్ పేరు, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి.. మీ రిజిస్ట్రర్ మొబైల్ నంబరుకు వచ్చిన ఓటీపీతో లాగిన్ అవ్వండి. ఒకవేళ మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం లేకపోతే.. మీరు నమోదు చేసుకోవాలి. నెట్‌బ్యాంకింగ్ ప్రక్రియ కోసం మీరు బ్యాంక్ హోమ్ బ్రాంచ్‌ని సందర్శించాల్సి ఉంటుంది. మీరు అవసరమైన ఫార్మాలిటీలను ఎక్కడ పూర్తి చేయాలి.

మీరు నెట్‌బ్యాంకింగ్‌లో లాగిన్ అయిన తరువాత..  అకౌంట్ సేవలు లేదా బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ విభాగాన్ని ఎంచుకోండి.  ఇక్కడ మీ అకౌంట్‌ ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించిన ఆప్షన్ ఉంటుంది. బదిలీ ప్రక్రియను ప్రారంభించడానికి ఆ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇక్కడ మీ ప్రస్తుత అకౌంట్‌కు సంబంధించిన వివరాలు, మీరు ఏ బ్రాంచ్‌కు బదిలీ చేయాలనుకుంటున్నారో వివరాలను ఎంటర్ చేయండి. ఈ సమాచారం సాధారణంగా మీ అకౌంట్ నంబర్, బ్రాంచ్ కోడ్, కొత్త బ్రాంచ్ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి పొరపాటు లేకుండా వివరాలను జాగ్రత్తగా నమోదు చేయండి. 

అన్ని వివరాలను ఎంటర్ చేసిన తరువాత.. మీరు ఇచ్చిన సమాచారాన్ని మరోసారి జాగ్రత్తగా చెక్ చేసుకుంది. ఈ సమాచారం సరైనదేనని ధృవీకరించండి. అన్ని వివరాలు సరిచూసుకున్న తరువాత బదిలీ అభ్యర్థనను సమర్పించండి. మీరు అందించిన వివరాలతో బదిలీ అభ్యర్థన ఫారమ్‌ను ఆన్‌లైన్ సిస్టమ్ రూపొందిస్తుంది. ఈ ఫారమ్‌కు ప్రత్యేకమైన రిఫరెన్స్ నంబర్ ఉంటుంది. ఈ ఫారమ్‌ను జాగ్రత్తగా భద్రపరుచుకోండి. ఈ ఫారమ్‌ను ప్రింట్ తీసుకుని.. మీ అకౌంట్ నంబరును రాసి సంతకం చేయండి.  

మీ అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్న కొత్త బ్రాంచ్‌కు వెళ్లండి. చిరునామా, గుర్తింపు రుజువు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ వంటి ఏవైనా ఇతర పత్రాలతో పాటు సంతకం చేసిన బదిలీ అభ్యర్థన ఫారమ్‌ను సమర్పించండి. మీ ఖాతా బదిలీ అభ్యర్థనను ప్రామాణీకరించడానికి కొత్త బ్రాంచ్ ధృవీకరణ ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఇందులో మీ పత్రాలను ధృవీకరించడం, కేవైసీ ఫార్మాలిటీలు చేయడం, మీ అకౌంట్ వివరాలను అప్‌డేట్ చేస్తారు. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీ అకౌంట్ కొత్త బ్రాంచ్‌కి విజయవంతంగా బదిలీ అయినట్లు మీకు మెసేజ్ రూపంలో సమాచారం వస్తుంది. 

(గమనిక: ఎస్‌బీఐ ప్రవేశపెట్టిన ప్రత్యేక ఫీచర్లు, అప్‌డేట్‌ల ఆధారంగా ఆన్‌లైన్ ప్రక్రియలో కొంచెం మార్పులు చేసి ఉండవచ్చు. మీకు ఏదైనా ఇబ్బంది తలెత్తినా.. ఏమైనా అనుమానాలు ఉంటే ఎస్‌బీఐ కస్టమర్ కేర్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించండి. లేదా మీ దగ్గరలోని బ్రాంచ్‌ని సందర్శించి పూర్తి మరింత సమాచారం తెలుసుకోండి.)

Also Read: Bandi Sanjay: మాటలు కోటలు దాటుతాయ్.. ఇప్పటికీ ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు: బండి సంజయ్  

Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ పెంపుతోపాటు ఈ బెనిఫిట్స్ అమలు..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News