Nissan Magnite SUV: ఎస్‌యూవీలకు క్రేజ్ పెరగడంతో దేశంలోని ప్రముఖ కార్ కంపెనీలు మారుతి, టాటా, హ్యుండయ్, హోండా, మహీంద్రా, నిస్సాన్ ఇలా అన్ని కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త వేరియంట్లలో ఎస్‌యూవీలు లాంచ్ చేస్తూ కస్టమర్లకు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
ఈ క్రమంలో నిస్సాన్ ఇండియా సరికొత్త ఎస్‌యూవీ ప్రవేశపెట్టింది. నిస్సాన్ మేగ్నైట్ ఈజెడ్ షిఫ్ట్ పేరుతో లాంచ్ చేసిన ఈ ఎస్‌యూవీకు ఓ ప్రత్యేకత ఉంది. దేశంలోనే అత్యంత చౌకధరకు లభ్యమౌతున్న ఎస్‌యూవీ ఇదే కావడం విశేషం. నిస్సాన్ కంపెనీ కేవలం 6.50 లక్షల ఎక్స్ షోరూం ధరకు ఈ ఎస్‌యూవీ అందుబాటులో ఉంచింది. ఈ కారు బుకింగ్స్ నిన్న అంటే అక్టోబర్ 10న ప్రారంభమయ్యాయి. కేవలం 11 వేల రూపాయలు టోకెన్ ఎమౌంట్ చెల్లించి ఈ కారు బుక్ చేసుకోవచ్చు.
ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ అంటే ఏఎంటీ వెర్షన్‌తో Nissan Magnite EZ Shift ను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ కారు ఎక్స్ షోరూం ధర 6.50 లక్షల నుంచి ప్రారంభమౌతుంది. ఇప్పటి వరకూ దేశంలో అందుబాటులో ఉన్న ఎస్‌యూవీల్లో ఇదే అత్యంత తక్కువ ధర అని కంపెనీ చెబుతోంది. ఇందులో XE, XL, XV, XV ప్రీమియం వేరియంట్లు ఉన్నాయి. నిస్సాన్ మేగ్నైట్ KURO ప్రత్యేక ఎడిషన్ కూడా దేశంలో లాంచ్ అయింది.
Nissan Magnite EZ Shift ప్రత్యేకతలు
నిస్సాన్ మేగ్నైట్ ఈజెడ్ షిఫ్ట్ 1.0 పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇంజన్ స్పీడ్ ఏఎంటీ ట్రాన్స్ మిషన్‌తో 70 బీహెచ్ పీ పవర్, 96 ఎన్ఎం టార్క్ జనరేట్ చేయగలదు. ఈ ఇంజన్ సామర్ధ్యం లీటర్‌కు 19.70 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 5 స్పీడ్ మేన్యువల్ గేర్ బాక్స్ అయితే లీటర్‌కు 19.35 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో డ్యూయల్ డ్రైవింగ్ మోడ్ ఉంటుంది. ఈ కారుకు ఉన్న అత్యంత ఆకర్షణీయమైన ప్రత్యేకత ఏంటంటే..అవసరాన్ని బట్టి మేన్యువల్ నుంచి ఆటోమేటిక్ వేరియంట్‌కు మారవచ్చు. స్టాప్ అండ్ గో ఫీచర్ మీ డ్రైవింగ్ అనుభూతినే మార్చేస్తుంది. ఈ ఫీచర్ వల్ల ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంటెలిజెంట్ క్రీప్ ఫంక్షన్ అనేది తక్కువ వేగంతో అంటే డెడ్ స్లోతో కారు నడపవచ్చు. కారు డెడ్ స్లోతో నడిపేటప్పుడు ఈ ఫీచర్ ప్రకారం యాక్సిలరేటర్ ఉపయోగించకుండానే బ్రేక్ ప్యాడ్ విడుదల చేయవచ్చు. అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు తరచూ క్లచ్ నొక్కే ఇబ్బంది ఉండదు.
ఫలితంగా నిస్సాన్ మేగ్నైట్ ఈజెడ్ షిఫ్ట్ డ్రైవింగ్ సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా కారు మెయింటెనెన్స్ కూడా తగ్గుతుంది. మైలేజ్‌పై ప్రతికూల ప్రభావం పడకుండా ఉంటుంది. లేకపోతే క్లచ్ ప్లేట్స్, క్లచ్ వైర్, బ్రేక్ ప్యాడ్, యాక్సిలేటర్ మెయింటెనెన్స్ పడిపోయే ప్రమాదముంది.
Also read: Asia Richest Person 2023: హారున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 విడుదల, ఆసియా కుబేరుడు అంబానీనే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook