DeepSeek founder Liang Wenfeng : డీప్‌సీక్‌ని రూపొందించి ప్రపంచానికి నిద్రలేకుండా చేసిన వ్యక్తి ఎవరు?

DeepSeek founder Liang Wenfeng : చైనీస్ ఏఐ డెవలపర్ డీప్‌సీక్ ప్రపంచంలోని అనేక దిగ్గజాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. DeepSeek-R1 మోడల్ ChatGPTని మించిపోయింది. ఈ కారణంగా, అనేక AI ఆధారిత అమెరికన్ కంపెనీల షేర్లు సోమవారం భారీగా పడిపోయాయి. DeepSeekని ఎవరు సృష్టించింది ఎవరు? పూర్త వివరాలు తెలుసుకుందాం.   

Written by - Bhoomi | Last Updated : Jan 28, 2025, 07:11 PM IST
DeepSeek founder Liang Wenfeng : డీప్‌సీక్‌ని రూపొందించి ప్రపంచానికి నిద్రలేకుండా చేసిన వ్యక్తి ఎవరు?

DeepSeek founder Liang Wenfeng : చైనీస్ ఏఐ డెవలపర్ డీప్‌సీక్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. ఇది కొత్త శక్తిగా ఆవిర్భవిస్తూనే సిలికాన్ వ్యాలీ పునాదిని కదిలించింది. అంతేకాదు డీప్‌సీక్ అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక మార్కెట్‌లలో ప్రకంపనలు సృష్టించింది. ప్రపంచంలోని చాలా మంది ధనవంతుల సంపద భారీగా క్షీణించింది. ఈ డీప్‌సీక్ అంటే ఏమిటి? దీన్ని ఎవరు సృష్టించారు?ఇప్పుడిదే హాట్ టాపిగ్గా మారింది. 

డీప్‌సీక్ అంటే ఏమిటి?

ఇది చైనా  AI స్టార్టప్. ఈ స్టార్టప్ ప్రత్యేకమైన ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందింది. దీని వ్యవస్థాపకుడు లియాంగ్ వెన్‌ఫెంగ్. ఈ స్టార్టప్ ఇటీవల తన AI చాట్‌బాట్ DeepSeek-R1ని విడుదల చేసింది. విడుదలైన కొద్ది కాలంలోనే మార్కెట్‌లో పాపులర్‌ అయింది. ఇది USలోని Apple యాప్ స్టోర్‌లో అత్యధిక రేటింగ్ పొందిన ఉచిత యాప్‌గా నిలిచింది.అంతేకాదు OpenAIకి చెందిన  ChatGPTని అధిగమించింది.

Also Read: Also Read: Old Tax Regime vs New Tax Regime:  పాత, కొత్త పన్ను విధానం.. రెండింట్లో ఏది బెటర్  

చాలా మంది ఈ AI అసిస్టెంట్ మోడల్‌ను ఇష్టపడుతున్నారు. రాయిటర్స్ నుండి వచ్చిన వార్తల ప్రకారం, ఈ DeepSeek-R1 పవర్డ్ AI చాట్‌బాట్ Nvidia,  H800 చిప్‌లను ఉపయోగించి శిక్షణ పొందింది. దాని ఖరీదు 60 లక్షల డాలర్ల (దాదాపు రూ. 52 కోట్లు) కంటే తక్కువ. అదే సమయంలో, ChatGPT తయారీలో దాదాపు 10 రెట్లు ఎక్కువ డబ్బు ఖర్చు చేసింది. 

లియాంగ్ వెన్‌ఫెంగ్ ఎవరు?

లియాంగ్ వెన్‌ఫెంగ్ డీప్‌సీక్ వ్యవస్థాపకుడు.. CEO. అతని తండ్రి చైనాలోని ఒక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు. లియాంగ్, చైనాలోని జాన్‌జియాంగ్‌లో జన్మించాడు. పాఠశాలలో చదువుతున్న తొలిరోజుల నుంచి కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపనతో ఉండేవాడు. అదే సమయంలో, అతను చూసిన సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం ప్రారంభించాడు. లియాంగ్ ప్రాథమిక విద్య మామూలు పాఠశాలలోనే కొనసాగింది.ఉన్నత విద్యాభ్యాసం మాత్రం ప్రతిష్టాత్మక సంస్థలలో పూర్తి చేశాడు. అక్కడే  అతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో తన పట్టును పెంచుకున్నాడు. 

Also Read: Deepseek Selloff: చైనా కోసం తవ్విన గోతిలో అమెరికానే పడింది! డీప్‌సీక్ షాక్ నుంచి అగ్రరాజ్యం కోలుకుంటుందా?  

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, లియాంగ్ AI వ్యాపారానికి సంబంధించిన అనేక కంపెనీలను స్థాపించాడు. 2013లో హాంగ్‌జౌ యాకేబీ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్,  2015లో జెజియాంగ్ జియుజాంగ్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీని స్థాపించాడు. 2019లో హై-ఫ్లైయర్ AIని కూడా ప్రారంభించాడు, ఇది 10 బిలియన్ యువాన్ల కంటే ఎక్కువ ఆస్తులను నిర్వహించే వెంచర్. దీని తర్వాత అతను 2023 సంవత్సరంలో డీప్‌సీక్‌ని స్థాపించాడు. ఇది AGIని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News