Seltos Vs Grand Vitara Vs Hyryder Vs Creta Price: ప్రస్తుతం కార్లకు భారీ డిమాండ్ పెరిగింది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు ఉన్న కార్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో అప్‌డేట్స్ చేయడంతోపాటు అనేక కొత్త ఫీచర్లు కూడా యాడ్ చేసింది. అయితే ఇటీవల క్రెటాకు సవాలు విసురుతూ.. అనేక కార్లు మార్కెట్‌లోకి వచ్చేశాయి. ఈ నేపథ్యంలో కొంతకాలంగా క్రెటాకు కాస్త డిమాండ్ తగ్గింది. అయితే కొత్త అప్‌డేట్స్‌తో క్రెటా మళ్లీ కస్లమర్ల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, స్కోడా కుషాక్ వంటి SUVలతో హ్యూందాయ్ క్రెటా పోటీపడుతోంది. ఈ కార్ల ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి తెలుసుకుందాం..
కియా సెల్టోస్ కారు ధర రూ.10.90 లక్షల నుంచి రూ.20.30 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఈ కారు ఫేస్ లిఫ్ట్ వెర్షన్ గతేడాది లాంచ్ అయింది. ఇది మూడు ట్రిమ్‌లలో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. టెక్ లైన్ (HT), GT లైన్, X-లైన్‌తోపాటు అనేక ఇతర సబ్ వేరియంట్‌లు ఉన్నాయి.
మారుతి గ్రాండ్ విటారా కారు రేటు రూ.10.70 లక్షల నుంచి రూ.19.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది సిగ్మా, డెల్టా, జీటా, జీటా+, ఆల్ఫా, ఆల్ఫా+ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్ Zeta Plus, Alpha Plus వేరియంట్‌లలో మార్కెట్‌లోకి అందుబాటులో ఉంది.
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ధర రూ.10.73 లక్షల నుంచి రూ. 19.74 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు అందుబాటు ఉంటుంది. E, S, G, V వంటి నాలుగు ట్రిమ్‌లలో మార్కెట్‌లోకి వస్తుంది. ఈ కారులో ఏడు మోనోటోన్, నాలుగు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌లు అందుబాటులో ఉంది. గ్రాండ్ విటారా కారును ఈ కారు ఆధారంగానే డిజైన్ చేశారు. స్కోడా కుషాక్ ధర రూ.11.89 లక్షల నుంచి రూ.20.49 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. యాక్టివ్, యాంబిషన్, స్టైల్ అనే మూడు ట్రిమ్‌లలో అందుబాటులోకి వస్తుంది. హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధర రూ.10,99,900. ఇందులో టాప్ వేరియంట్ ధర రూ.19,99,900కి చేరుకుంది.
ఈ కార్ల ధరలు అన్ని పరిశీలిస్తే.. మారుతి గ్రాండ్ విటారా ప్రారంభ ధర అన్నింటి కంటే తక్కువగా ఉంది. గ్రాండ్ విటారా 3 1.5 లీటర్ పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్, 1.5-లీటర్ పెట్రోల్ స్ట్రాంగ్-హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. సీఎన్‌జీ కిట్ 1.5-లీటర్ పెట్రోల్ (నాన్-హైబ్రిడ్) ఇంజన్‌తో కూడా అందుబాటులో ఉంది.
Also Read: Chandrababu Case: క్వాష్ కొట్టివేత, ద్విసభ్య ధర్మాసనంలో ఎవరేమన్నారంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter