AP MLC Elections : ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వాస్తవానికి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగాయి. మొత్తం ఏడు స్థానాలకు ఎన్నికలు జరగగా వైసిపి ఏడుగురు అభ్యర్థులను బరిలోకి దించింది. అయితే గెలిచేందుకు అవకాశం లేకపోయినా సరే తెలుగుదేశం పార్టీ కూడా విజయవాడ మాజీ మేయర్ గా పనిచేసిన పంచుమర్తి అనురాధను రంగంలోకి దించింది.
అయితే చంద్రబాబు ఏదో చేయడానికి ప్లాన్ చేసి ఇలా బలం లేని చోట కూడా అభ్యర్థిని దించారని పెద్ద ఎత్తున వైసీపీ నుంచి విమర్శలు కూడా వచ్చాయి. అయితే అనూహ్యంగా 23 ఓట్లు సాధించి పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వైసీపీ ఏడుగురు అభ్యర్థులను బరిలోకి దించడంతో ఎవరు ఓడిపోతారు అనే విషయం మీద ఆసక్తికరమైన చర్చ జరగగా చివరికి తెలుగుదేశం పార్టీ నుంచి ఈ మధ్యకాలంలోనే వైసీపీలో చేరిన కైకలూరుకు చెందిన జయ మంగళ వెంకటరమణ ఓడిపోయారని ప్రచారం జరిగింది.
కానీ చివరికి కోలా గురువులు ఓడినట్టు అధికారులు వెల్లడించారు. నిజానికి వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒక్కొక్క అభ్యర్థికి 22 మంది ఎమ్మెల్యేలను కేటాయించి ఆ 22 మంది ఎమ్మెల్యేల బాధ్యతలు ఒక్కొక్క సీనియర్ నేతకు అప్పగించారు. అయితే రెండు బ్యాచులకు చెందిన 44 మంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారని అంచనాల నేపథ్యంలో జయ మంగళ వెంకటరమణ, కోలా గురువులు ఇద్దరికీ చెరొక ఇరవై ఒక్క ఓట్లు మాత్రమే లభించాయి.
అయితే వీరి విషయంలో రెండో ప్రాధాన్యత ఓటు లెక్కించిన తర్వాత జయ మంగళ వెంకటరమణ ఓడిపోయారని కోలా గురువులు గెలిచారని ముందు ప్రచారం జరిగినా చివరికి జయమంగళ వెంకటరమణ ఓడిపోయారని అధికారులు ప్రకటించారు. ఒకరకంగా వైసీపీ బరిలోకి దింపిన ఏడుగురు అభ్యర్థులలో ఒకరు ఓడిపోయారు అనే మాటే ఆ పార్టీ శ్రేణులకు మింగుడు పాడడం లేదు.
Also Read: Rashmika Mandanna Photos: బ్లేజర్లో మెరిసిపోతున్న రష్మిక మందన్నా.. బటన్స్ విప్పేసి మరీ అందాల జాతర!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook